నెలనెలా ఆదాయం రావాలంటే...
నెలనెలా వడ్డీ అందేలా మా అమ్మ పేరుమీద రూ.12 లక్షలు జమ చేయాలనుకుంటున్నాం. ఆమె వయసు 54. డెట్ ఫండ్లలో మదుపు చేయొచ్చా?
నెలనెలా వడ్డీ అందేలా మా అమ్మ పేరుమీద రూ.12 లక్షలు జమ చేయాలనుకుంటున్నాం. ఆమె వయసు 54. డెట్ ఫండ్లలో మదుపు చేయొచ్చా?
ప్రదీప్
మీరు డెట్ ఫండ్లలో మదుపు చేసి, క్రమానుగత విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలనెలా కొంత మొత్తం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ఇందులో కొంత నష్టభయం ఉంటుంది. మొత్తం డబ్బులు ఎప్పుడు కావాలన్నా వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటిలో 7-8 శాతం వరకూ రాబడి వస్తోంది. మంచి క్రెడిట్ క్వాలిటీ ఉన్న ఫండ్లను ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా నాన్ క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లనూ చూడొచ్చు. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మంచి స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి, వీటినీ పరిశీలించండి.
ఇటీవలే పదవీ విరమణ చేశాను. బీమా సంస్థలు అందిస్తున్న ఇమ్మీడియట్ యాన్యుటీ పథకాలను ఎంచుకోవచ్చా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
భాస్కర్
క్రమం తప్పకుండా ఆదాయం రావాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్లు ఉపయోగపడతాయి. ఇందులో జీవితాంతం పింఛను ఇచ్చి, తర్వాత పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా తీసుకోండి. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లలోనూ మదుపు చేసి, మీ అవసరానికి తగ్గట్టు వెనక్కి తీసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఇందులో మంచి రాబడికి అవకాశం ఉంటుంది. నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు.
మూడేళ్ల మా అమ్మాయి పేరు మీద నెలకు రూ.5 వేలు జమ చేయాలనుకుంటున్నాను. కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేసేందుకు ఏ పథకాలు మంచివి?
రజిత
మీరు దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టినప్పుడు మంచి రాబడికి అవకాశం ఉంటుంది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.3,000 డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.2వేలను సుకన్య సమృద్ధి యోజనలో నెలనెలా జమ చేయండి. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే 11 శాతం సగటు రాబడితో రూ.20,64,321 అయ్యే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.10 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. పాత పన్ను విధానంలో 20 శాతం శ్లాబులోకి వస్తాను. నేను ఏం చేయాలి?
శ్రీనివాస్
పన్ను ఆదా గురించి పెట్టుబడి పెట్టాలనుకుంటే.. రూ.10వేలను ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్) మదుపు చేయండి. ఇందులో మూడేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. పన్ను ఆదా పథకాల్లో ఇదే తక్కువ లాకిన్ వ్యవధి. స్టాక్ మార్కెట్ పనితీరూ బాగుంది. కాబట్టి, భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు లేవు. నాకు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవచ్చా?
బద్రి
ఇప్పటికీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. కానీ, బీమా పాలసీని తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య ఇబ్బందులను ప్రతిపాదన పత్రంలో తెలియజేయండి. దీంతోపాటు గతంలో మీరేమైనా చికిత్సలు తీసుకుంటే ఆ వివరాలూ పేర్కొనండి. బీమా కంపెనీ వైద్య పరీక్షల కోసం అడిగే ఆస్కారమూ ఉంది. ఈ నివేదికల ఆధారంగానే పాలసీ ఇవ్వాలా వద్దా అనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. పాలసీ ఇస్తే కొంత అదనపు ప్రీమియం వసూలు చేసే అవకాశమూ ఉంది.
తుమ్మ బాల్‌రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bihar Caste survey: బిహార్‌లో ఓబీసీ, ఈబీసీలే 63%.. కులగణన సర్వేలో వెల్లడి
-
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరే: మంత్రి హరీశ్
-
Amazon River: అమెజాన్ నదిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
-
DL Ravindra Reddy: తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు: డీఎల్
-
Salaar: ‘సలార్’ ఆ సినిమాకు రీమేక్..? ఈ రూమర్‌కు అసలు కారణమిదే!
-
PM modi: గహ్లోత్‌కు ఓటమి తప్పదని అర్థమైంది: మోదీ