ప్రత్యేకంగా పాలసీ తీసుకోవాలా?

చేయాలనే ఆలోచన ఉంది. నెలకు రూ.8వేల వరకూ పెట్టుబడి పెట్టగలను. నా ప్రణాళిక ఎలా ఉండాలి?

Updated : 18 Aug 2023 01:41 IST

 

  •  మా అబ్బాయి పేరు మీద నెలకు రూ.20 వేల వరకూ వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నా. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?

  ప్రకాశ్‌

మీకు పదేళ్ల సమయం ఉంది కాబట్టి, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవచ్చు. ఇందుకోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. నెలకు రూ.20వేల చొప్పున 10 ఏళ్లపాటు 10 శాతం వచ్చేలా మదుపు చేస్తే రూ.42,11,696 అయ్యేందుకు అవకాశం ఉంది.

  • ఆరు నెలల క్రితం ఉద్యోగంలో చేరాను. బృంద ఆరోగ్య బీమా పాలసీలో రూ.4 లక్షల వరకూ రక్షణ ఉంది. సొంతంగా ఒక పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉందా?

సాయి
బృంద ఆరోగ్య బీమాను ఎప్పుడూ ప్రాథమిక పాలసీగా భావించకూడదు. ఇది ఒక అదనపు రక్షణ మాత్రమే. రూ.4లక్షల బీమా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువే. సొంతంగా మరో రూ.5లక్షల పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి.

  • నేను చిరు వ్యాపారిని. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచన ఉంది. నెలకు రూ.8వేల వరకూ పెట్టుబడి పెట్టగలను. నా ప్రణాళిక ఎలా ఉండాలి?

 శ్రీనివాస్‌

మీపై ఆధారపడిన వారు ఎవరైనా ఉంటే.. తగినంత మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా పాలసీలనూ తీసుకోండి. కనీసం ఏడాది ఖర్చులకు సరిపోయేలా అత్యవసర నిధిని పక్కన పెట్టుకోండి. రూ. 8 వేలలో రూ.3 వేలను పీపీఎఫ్‌లోనూ, రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలోనూ మదుపు చేయండి.
 తుమ్మ బాల్‌రాజ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు