తీవ్ర వ్యాధులకు పాలసీ తీసుకుంటే..
నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. ప్రస్తుతం నెలకు రూ.35,000 గృహరుణం ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఇంకా 6 ఏళ్లపాటు చెల్లించాలి.
నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. ప్రస్తుతం నెలకు రూ.35,000 గృహరుణం ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఇంకా 6 ఏళ్లపాటు చెల్లించాలి. పదవీ విరమణ చేసిన తర్వాత వాయిదాలు చెల్లించడం మంచిదేనా? ఇప్పుడే ఈఎంఐ పెంచుకొని, రుణం తీర్చేయాలా?
- రాజారావు
- పదవీ విరమణ చేసే నాటికి అప్పులు ఏమీ లేకుండా చూసుకోవడం మంచిది. పదవీ విరమణ తర్వాత గృహరుణానికి ఈఎంఐ చెల్లించడం కష్టం కావచ్చు. కాబట్టి, మీ దగ్గర అధిక మొత్తం ఉంటే, ఇంటి రుణాన్ని తీర్చేందుకు ప్రయత్నించండి.
తీవ్ర వ్యాధులకు వర్తించేలా క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ తీసుకుంటే సరిపోతుందా? ఆరోగ్య బీమా పాలసీతో పోలిస్తే ఇది మంచిదేనా?
- మహేశ్
- తీవ్ర వ్యాధులకు వర్తించే క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీని విడిగా తీసుకోవచ్చు. లేదా టర్మ్ పాలసీలతో కలిసి రైడర్లుగానూ ఎంచుకోవచ్చు. పాలసీ జాబితాలోని ఏదైనా తీవ్ర వ్యాధి వచ్చినప్పుడు ఇది నిర్ణీత పరిహారం చెల్లిస్తుంది. ఆరోగ్య బీమా పాలసీతో దీన్ని పోల్చలేం. ఆరోగ్య బీమా పాలసీ ఉంటే.. ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్నప్పుడు ఆ బిల్లులను భరిస్తుంది. ప్రస్తుతం వైద్య ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఆరోగ్య బీమా పాలసీ కచ్చితమైన అవసరం. క్రిటికల్ ఇల్‌నెస్ అదనపు రక్షణగా మాత్రమే ఉపయోగపడుతుంది.
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.25,000 మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి. బంగారాన్ని కొనొచ్చా?
-
వేణుగోపాల్
- ముందుగా మీ అమ్మాయి భవిష్యత్ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపై తగినంత బీమా రక్షణ ఉండేలా చూసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.25వేలను ఈక్విటీ ఆధారిత పెట్టుబడులకు కేటాయించండి. ఇందుకోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగతంగా మదుపు చేయండి. ఎనిమిదేళ్లపాటు నెలకు రూ.25వేల చొప్పున పెట్టుబడి పెడితే.. సగటున 12 శాతం వార్షిక రాబడి అంచనాతో రూ.36,89,907 అయ్యేందుకు అవకాశం ఉంది.
మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.50 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాను. నా వయసు 44. మరో రూ.30 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?
-
రమణ
- మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల బీమా ఉండాలి. ఇప్పటికే రూ.50లక్షలకు బీమా ఉంది. కాబట్టి, మిగతా మొత్తానికి సరిపోయేలా పాలసీ తీసుకోండి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా కంపెనీ నుంచి కొత్త పాలసీని తీసుకోండి. పాత పాలసీ వివరాలు కచ్చితంగా తెలియజేయాలి. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలకు అధికంగా చెల్లించాల్సి రావచ్చు. సాధారణ టర్మ్ పాలసీని ఎంచుకోవడమే ఉత్తమం.
పన్ను ఆదా కోసం మూడేళ్ల క్రితం మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.50 వేల ప్రీమియం. కొత్త పన్ను విధానంలోకి మారితే నాకు పన్ను భారం పెద్దగా ఉండదు. ఈ పాలసీని రద్దు చేసుకోవచ్చా?
-
కృష్ణ
- సంప్రదాయ పాలసీలైన మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీలను మూడేళ్ల తర్వాత స్వాధీనం చేయొచ్చు. మీరు చెల్లించిన ప్రీమియంలో 50శాతం వరకూ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ముందుగా బీమా సంస్థను సంప్రదించి, ఎంత మొత్తం వెనక్కి వస్తుందో తెలుసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
- తుమ్మ బాల్‌రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
Art of living: గురుదేవ్ లేకుంటే మా దేశంలో శాంతి అసాధ్యం: కొలంబియా ఎంపీ
-
యువకుడి కడుపులో గర్భాశయం.. కంగుతిన్న వైద్యులు
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు.. స్వచ్ఛసేవలో అధికారుల ‘చెత్త పని’
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు