WhatsApp: వాట్సప్‌ వెబ్‌లో స్క్రీన్‌ లాక్‌.. ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలంటే?

వెబ్‌లో వాట్సప్‌ వాడుతున్నారా? మరి లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌ గురించి మీకు తెలుసా? వెబ్‌ మీద వాట్సప్‌ను వాడేటప్పుడు మరింత భద్రత కోసం ఇటీవలే దీన్ని జోడించారు.

Updated : 01 Nov 2023 10:37 IST

వెబ్‌లో వాట్సప్‌ వాడుతున్నారా? మరి లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌ గురించి మీకు తెలుసా? వెబ్‌ మీద వాట్సప్‌ను వాడేటప్పుడు మరింత భద్రత కోసం ఇటీవలే దీన్ని జోడించారు. ముఖ్యంగా ఆఫీసుల వంటి చోట్ల ఎక్కువ మందితో కలిసి పనిచేసేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. కార్యాలయంలో కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడూ విరామం తీసుకోవటం సహజమే. టిఫిన్‌ చేయటానికో, టీ తాగటానికో కాసేపు బయటకు వెళ్తుంటారు. వాట్సప్‌ను ఓపెన్‌ చేసి పెడితే ఎవరైనా చూడొచ్చు. అందుకే లాగవుట్‌ అవుతాం. కుర్చీలో కూర్చున్నాక తిరిగి లాగిన్‌ అవుతాం. ఇదంతా పెద్ద ప్రహసనం. పైగా తరచూ లాగిన్‌ అవుతుంటే గత మెసేజ్‌లు వెంటనే కనిపించకపోవచ్చు. మాటిమాటికీ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లాగిన్‌ కావటం విసుగు తెప్పించొచ్చు కూడా. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా చూడటానికి లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలి?

  • ముందుగా web.whatsapp.com లో క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ కావాలి.
  • పైన మూడు చుక్కల గుర్తు మీద క్లిక్‌ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
  • సెటింగ్స్‌లో ప్రైవసీని ఎంచుకొని కిందికి స్క్రోల్‌ చేస్తూ వెళ్లి, లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తెర మీద కనిపించే సూచనలు పాటిస్తూ పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవాలి. ఓకే మీద నొక్కితే పాస్‌వర్డ్‌ కన్‌ఫర్మ్‌ అవుతుంది.
  • కావాలనుకుంటే ఆటోమేటిక్‌ స్క్రీన్‌ లాక్‌ టైమింగ్‌నూ ఎంచుకోవచ్చు. దీంతో నిర్ణయించుకున్న సమయం తర్వాత దానంతటదే స్క్రీన్‌ లాక్‌ అయిపోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని