Gold rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold rate: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1000 మేర తగ్గుముఖం పట్టింది.

Published : 05 Dec 2023 18:26 IST

Gold Rate | దిల్లీ: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్స్‌) ధర రూ.1050 తగ్గి రూ.63,250కి చేరింది. క్రితం రోజు ధర రూ.64,300గా ఉంది. వెండి సైతం కిలో ధర రూ.1700 క్షీణించి రూ.78,500కు చేరింది. ఇటీవల ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దిగి వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

👉 Follow EENADU WhatsApp Channel

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 2037 డాలర్లుగా ఉంది. అలాగే, వెండి ఔన్సు ధర 24.50 డాలర్లు పలుకుతోంది. అమెరికాలో డాలర్‌, యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో బంగారం ధర తగ్గుముఖం పట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. 

నోట్‌: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పై ధరలో జీఎస్టీ చేర్చలేదు. వాస్తవ ధరల కోసం దగ్గర్లోని దుకాణదారుడిని సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని