AC cabins in trucks: ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ తప్పనిసరి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

AC cabins in trucks: డ్రైవర్ల పని వాతావరణాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  

Updated : 10 Dec 2023 15:45 IST

దిల్లీ: టక్కుల్లో ఏసీ క్యాబిన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్‌ 1 తర్వాత తయారు చేయబోయే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ (AC cabins in trucks) ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్‌2, ఎన్‌3 కేటగిరీ పరిధిలోకి వచ్చే ట్రక్కులకు దీన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సరకుల రవాణాకు ఉపయోగించే ట్రక్కుల స్థూల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల వరకు ఉంటే అవి ఎన్‌2 కేటగిరీ కిందకు వస్తాయి. 12 టన్నులు దాటితే ఆ ట్రక్కును ఎన్‌3గా వర్గీకరిస్తారు.

ధరలు..‘కారు’ చౌకగా

దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) జులైలోనే వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్లకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త నిబంధన తీసుకొస్తున్నామని తెలిపారు. తద్వారా వారి పని సామర్థ్యం పెరుగుతుందన్నారు. వేడి వాతావరణంలో పనిచేసే వారికి ఇకపై అలసట నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన రవాణా రంగంలో ట్రక్కు డ్రైవర్లది చాలా కీలక పాత్ర అని కొనియాడారు. వారి సమస్యల్ని పరిష్కరించడం చాలా ముఖ్యమైన అంశమన్నారు. పని వాతావరణాన్ని మెరుగుపర్చడం వల్ల వారి మానసిక స్థితి కూడా బాగుంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు