Netflix: నెట్‌ఫ్లిక్స్‌ చూస్తున్నారా.. అయితే ఈ ఫీచర్స్‌ తెలుకోవాల్సిందే!

నెట్‌ప్లిక్స్‌ (Netflix) ఓటీటీ సర్వీసును మీరు వాడే ఉంటారు. అయితే, దానికి సంబంధించిన షార్ట్‌కట్లు, కొన్ని ఆప్షన్లు మీ కోసం.. 

Updated : 14 Jul 2023 16:42 IST

మీకు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) గురించి తెలిసే ఉంటుంది.. అయితే అందులో కొన్ని ఆసక్తికర ఫీచర్లు కూడా ఉన్నాయి. అవి అందరికీ తెలిసే అవకాశం తక్కువ. అందుకే ఈ కథనంలో మీకు అలాంటి ఫీచర్లు అందిస్తున్నాం. మీకు తెలిస్తే క్రాస్‌ చెక్‌ చేసుకోండి. లేదంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయండి.  

సెర్చ్‌ బార్‌లో ఇవి తెలుసా?

నెట్‌ఫ్లిక్స్‌లో సెర్చ్ బార్‌ను ఇంకా బాగా వాడుకోవచ్చు. ఉదాహరణకు.. ‘నెట్‌ఫ్లిక్స్’ అని టైప్ చేస్తే ‘నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్’ టైటిల్స్‌ను చూపిస్తుంది. ‘బ్రౌజ్‌ బై లాంగ్వేజ్‌’ ద్వారా మీ ప్రాధాన్యత ఆధారంగా సిరీస్‌లు, సినిమాలు చూడొచ్చు. 

హైడ్‌ చేయాలంటే...

మీరు చూసే, చూసిన కంటెంట్‌లను ఇతరులకు తెలియకుండా కూడా చేయొచ్చు. హిస్టరీలో థంబ్‌ నెయిల్స్‌పై ఉన్న  ‘X’ బటన్‌ను క్లిక్‌ చేసి లిస్ట్‌లో కనిపించకుండా చేయొచ్చు. ఒకే అకౌంట్‌ / డివైజ్‌ను ఇద్దరు వాడుతుంటే ఈ ఆప్షన్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

డేటా వినియోగం...

మొబైల్‌ డేటాతో స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ని చూస్తున్నట్లయితే రోజువారీ డేటా లిమిట్‌ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అయితే సెట్టింగ్స్‌ ఐకాన్‌ బటన్‌ క్లిక్‌ చేసి సెల్యులార్‌ డేటా యూసేజ్‌ను మార్చుకోవచ్చు. క్వాలిటీని తగ్గిస్తే డేటా వినియోగం తగ్గుతుంది. అయితే, వైఫైలో చూస్తే ఈ సమస్య పెద్దగా ఉండదు. 

షార్ట్‌కట్స్‌తో..

కంప్యూటర్‌లో నెట్‌ఫ్లిక్స్‌ వాడుతున్నట్లయితే... కీబోర్డ్‌ షార్టకట్స్‌ను ఉపయోగించి ఈజీగా బ్రౌజ్‌ చేయొచ్చు. కీబోర్డులో ‘F’ క్లిక్‌ చేస్తే ఫుల్‌ స్క్రీన్‌ వస్తుంది. ‘Esc’ క్లిక్‌ చేసి ఫుల్‌ స్క్రీన్‌ నుంచి బయటకు రావొచ్చు. స్పేస్‌బార్‌ క్లిక్‌ చేస్తే వీడియోను పాజ్‌ చేయొచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి షిఫ్ట్ + రైట్‌ యారో కీ నొక్కాలి. రివైండ్ చేయడానికి షిఫ్ట్ + లెఫ్ట్‌ యారో క్లిక్‌ చేయాలి. ‘M’ బటన్‌ క్లిక్‌ చేస్తే మ్యూట్‌ అవుతుంది. ఇక ఇంట్రోను స్కిప్‌ చేయడానికి ‘S’కీని ఉపయోగించొచ్చు. 

చివరిగా... వీడియో దగ్గర ‘థంబ్స్ అప్’ లేదా ‘థంబ్స్ డౌన్’తో రేటింగ్‌ ఇస్తే.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అల్గారిథమ్‌ వాటిని పరిశీలనలోకి తీసుకొని.. ఆ తర్వాత అలాంటి వీడియో మీకు సజెస్ట్‌ చేయాలో వద్దో నిర్ణయిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని