Home Loan: మీ క్రెడిట్‌ స్కోరు బాగుందా? హోమ్‌లోన్‌పై ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ..?

ఈ గృహ రుణానికి క్రెడిట్ స్కోరు చాలా ముఖ్య‌మైన‌ది.

Updated : 12 Sep 2022 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం ఆర్థికంగా తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఇంటి కొనుగోలు ఒకటి. ఇది అందుబాటులో ఉన్న చౌకైన రుణం అని నిపుణులు చెబుతుంటారు. గృహ రుణం అనేది ఒక కుటుంబానికి ఉప‌యోగ‌ప‌డే రుణంగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే, ఇది దీర్ఘ‌కాలంలో విలువైన స్థిరాస్తిని పొందేలా చేస్తుంది. ఈ గృహ రుణానికి క్రెడిట్ స్కోరు చాలా ముఖ్య‌మైన‌ది. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేటుకే బ్యాంకులు రుణాలను అంద‌జేస్తాయి. 750, అంత‌క‌న్నా ఎక్కువ‌ క్రెడిట్ స్కోరు.. మీకు త‌క్కువ వ‌డ్డీ రేటుతో పాటు వేగంగా రుణం పొంద‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 0.5% రుణ వడ్డీ రేటు వ్య‌త్యాసం కూడా దీర్ఘకాలంలో మీకు చాలా వరకు ఆదా చేయగలదు. కాబ‌ట్టి, మీ క్రెడిట్ స్కోరును త‌నిఖీ చేయండి. గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసేముందు క్రెడిట్ స్కోరుని పెంచుకోవ‌డానికి ఉన్న మార్గాలను అనుసరించండి.

Also Read: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? అయితే, ఇలా పెంచుకోండి!

గృహ రుణం ఉమ్మ‌డిగా తీసుకుంటే కూడా కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వ్య‌క్తిగ‌తంగా కంటే ఉమ్మ‌డిగా ఎక్కువ మొత్తంలో రుణం పొందొచ్చు. అలాగే, ఇద్దరిలో ఒకరికి మంచి క్రెడిట్ స్కోరు ఉన్నా కూడా బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు ఎక్కువ. బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర గృహ రుణాల‌కు 800 అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వినియోగ‌దారుల‌కు 7.80% నుంచి గృహ రుణాల‌ను అందిస్తోంది. 700 క‌న్నా త‌క్కువ క్రెడిట్ స్కోరు ఉన్న‌వారికి కూడా గృహ రుణం అందుతుంది, కానీ వ‌డ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. 700 నుంచి 800, అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న‌వారికి వివిధ బ్యాంకులు అందించే గృహ రుణ వ‌డ్డీ రేట్లు ఈ కింది ప‌ట్టిక‌లో ఉంది.

నోట్‌: ఈ డేటా 2022 సెప్టెంబర్‌ 6 నాటిది. క్రెడిట్ స్కోరుతో లింక్ చేసిన గృహ రుణ వ‌డ్డీ రేటు డేటా ఈ పట్టికలో ఉంది. వ‌డ్డీ రేటు సూచిక మాత్ర‌మే. వ్యక్తులు, ఇతర కారణాల వల్ల వ‌డ్డీ రేటులో మార్పులుండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని