Hyundai: తమిళనాడులో హ్యుందాయ్‌ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమిళనాడులో మరో రూ.ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Updated : 08 Jan 2024 13:53 IST

దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) తమిళనాడు (TamilNadu)లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రాష్ట్రంలో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. తమిళనాడు ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ 2024’ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం గతంలో ప్రకటించిన పెట్టుబడులకు అదనమని వెల్లడించింది.

హ్యుందాయ్‌ సంస్థ రాబోయే పదేళ్లలో (2023-2032) తమిళనాడులో రూ.20 వేల కోట్లతో విద్యుత్తు వాహనాల (EV) తయారీ, ఈవీ ఛార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు నైపుణ్య శిక్షణ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో ప్రకటించింది.  రాష్ట్రంలో సామాజిక-ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు తమ సంస్థ నిబద్ధతకు ఈ పెట్టుబడులు నిదర్శనమని హ్యుందాయ్‌ ఎండీ ఉన్‌సూ కిమ్‌ తెలిపారు.

మస్క్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు.. స్పందించిన టెస్లా అధినేత

పెట్టుబడుల్లో భాగంగా ఈ సంస్థ రూ.180 కోట్లతో ఐఐటీ మద్రాస్‌తో కలిసి తమిళనాడులో హైడ్రోజన్‌ వ్యాలీ ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో ఈ సంస్థకు చెన్నై నగరం శివారులో అతి పెద్ద తయారీ యూనిట్‌ ఉంది. ఏటా ఇక్కడి నుంచి 8 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని