Hyundai Creta: హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. రూ.11 లక్షల నుంచి ప్రారంభం

Hyundai Creta facelift: హ్యుందాయ్‌ తన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Published : 17 Jan 2024 01:52 IST

Hyundai Creta | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ (Hyundai) తన మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంఛ్‌ చేసింది. దీని ధర రూ.10.99 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.19.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు లిమిటెడ్‌ పీరియడ్‌ మాత్రమేనని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో ఉన్న కియా సెల్టోస్‌, మారుతీ సుజుకీ గ్రాండ్‌ విటారా, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైర్డర్‌, హోండా ఎలివేట్‌, స్కోడా కుషక్‌, ఫోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

2015లో తొలుత లాంచ్‌ అయిన క్రెటా.. తొమ్మిదేళ్లలో 9.80 లక్షల యూనిట్లు అమ్ముడైంది. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని తట్టుకుని మరీ టాప్‌ సెల్లర్‌గా నిలుస్తోంది. కొత్త హ్యుందాయ్‌ క్రెటా 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో, ఏడు వేరియంట్లలో వస్తోంది. కొత్త క్రెటాలో ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌లో పలు మార్పులు చేశారు. గ్రిల్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ హెడ్‌ల్యాంప్స్‌లో కొన్ని మార్పులు చేశారు. మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. కొత్తగా రోబస్ట్‌ ఎమరాల్డ్‌ పెరల్‌ కలర్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చారు.

నయా లుక్‌లో మహీంద్రా XUV700.. ధర, ఫీచర్లు ఇవే!

10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఇచ్చారు. ఇందులో ఆటోమేటిక్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌ ఉంది. వాయిస్‌ ఎనేబుల్డ్‌ పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌, సరౌండ్‌ వ్యూ మానిటర్‌ ఉన్నాయి. కొత్త క్రెటాలో చెప్పుకోదగ్గది స్మార్ట్‌సెన్స్‌ లెవల్‌ 2 అడాస్‌. ఇందులో కొలిజన్‌ వార్నింగ్‌, బ్లైండ్‌స్పాట్ వ్యూ మానిటర్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు లభిస్తాయి. భద్రతా పరంగా చూస్తే.. 6 ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకూ 3 పాయింట్‌ సీటుబెల్టులు, నాలుగు వీల్స్‌కు డిస్క్‌బ్రేకులు, హిల్‌ అసిస్టెంట్‌, ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, టైర్‌ ప్రెజర్ మానిటరింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టార్ట్‌/స్టాప్‌, డోర్‌ లాక్‌/ అన్‌లాక్‌, వెహికిల్‌ స్టేటస్‌ ఇన్ఫర్మేషన్‌, వెహికల్‌ అలర్ట్స్‌ వంటి మొత్తం 70 కనెక్టెడ్‌ ఫీచర్లను హ్యుందాయ్‌ అందిస్తోంది. ఇన్‌బిల్ట్‌గా జియో సావన్‌ ప్రో మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ (ఏడాది సబ్‌స్క్రిప్షన్‌) ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని