Hyundai Motor: వాటి బాటలోనే హ్యుందాయ్‌.. జవనరి నుంచి వాహన ధరలు పెంపు

Hyundai Motor: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వాహన ధరలు జనవరి నుంచి పెరగనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ గురువారం ప్రకటించింది.

Updated : 07 Dec 2023 15:55 IST

Hyundai Motor price hike | దిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India Ltd) సైతం వాహన ధరల్ని పెంపును గురువారం ప్రకటించింది. జనవరి1 నుంచి అన్ని మోడళ్ల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్ (Tata motors), మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra), మారుతీ సుజుకి (Maruti Suzuki), హోండా (Honda), ఆడి (Audi)..  కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరల్ని పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో హ్యుందాయ్‌ చేరింది.

గోఫస్ట్‌ కథ కంచికేనా?

ముడి సరకు ధరలు పెరగటంతో ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాహన ధరల్ని పెంచుతున్నట్లు హ్యుందాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో పెరిగిన వ్యయంలోని కొంత భారం కస్టమర్లపై పడిందని తెలిపింది.  గ్రాండ్‌ ఐ10 NIOS, ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ IONIQ5 వంటి తదితర మోడళ్లను హ్యుందాయ్‌ దేశంలో విక్రయిస్తోంది. వచ్చే ఏడాదిలో ధరలు పెంపుదలను ప్రకటించినప్పటికీ ఎంతమొత్తం పెంచనుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు