Q-A: క్యాన్సర్ నుంచి కోలుకున్నాక బీమా పాలసీలు తీసుకోవచ్చా?
క్లిష్టమైన వ్యాధులు నిర్ధారణ అయ్యాక పాలసీ తీసుకోవడం చాలా కష్టం. ప్రీమియం కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా తీసుకోవడం మంచిది.
* సర్, మా అన్నయ్య(38)కు భార్య, ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు(10, 8), ఒక అబ్బాయి(6). ఆయనకు గతేడాది పేగు క్యాన్సర్ నిర్దారణ అయ్యింది. మూడో స్టేజీలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వెంటనే సర్జరీ చేశారు. కీమోథెరపీ(ఆరు నెలలు) కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని మునుపటి మాదిరిగా ఉన్నారు. ప్రతి మూడు నెలలకు రక్త పరీక్షలూ చేస్తున్నారు. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని..పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో మూడేళ్లపాటు(మొత్తం ఐదేళ్లు) పరీక్షలు కొనసాగించాలని చెప్పారు. అయితే, క్యాన్సర్‌కు ముందు అన్నయ్య పేరు మీద ఎటువంటి ఆరోగ్య, జీవిత, టర్మ్ పాలసీలు లేవు. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్న ఆయన..బీమా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడూ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారికి ఉన్న వివిధ పాలసీలు, అవి అందిస్తోన్న కంపెనీల వివరాలు తెలుపగలరు.
- ఈ-మెయిల్
* క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఇలాంటి వ్యాధులను గుర్తించిన వారికి చాలా వరకు సంస్థలు బీమాను ఇచ్చేందుకు మొగ్గుచూపవు. మీ అన్నయ్య క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు అని తెలియజేసారు. అయితే, క్యాన్సర్ నుంచి పూర్తిగా బయట పడేందుకు దీర్ఘకాలం సమయం పడుతుంది. ఐదు సంవత్సరాల వరకు తిరిగి వచ్చే చాన్స్ ఉంటుంది అని వైద్య నిపుణులు చెబుతుంటారు. కాబట్టి, క్యాన్సర్ తగ్గినా..ఆరోగ్య, జీవిత బీమాలను కొనుగోలు చేయడం అంత సులభం కాదు. కొద్ది సంస్థలు మాత్రమే ఇటువంటి వారికి పాలసీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
ఆరోగ్య బీమా విషయానికి వస్తే..
ఇప్పటికే క్యాన్సర్ నుంచి కోలుకున్నా..భవిష్యత్తు రక్షణ కోసం ప్రత్యేక క్యాన్సర్ బీమా పాలసీలను తీసుకోవచ్చు. ఉదాహరణకి, స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ క్యాన్సర్ ప్లాన్ ఒకసారి క్యాన్సర్ నుంచి బయటపడిన వారు, రెండవసారి ఈ వ్యాధి బారిన పడితే బీమా కవరేజీని అందిస్తుంది. అయితే ఇందులో 30 నుంచి 60 రోజుల వెయిటింగ్ పిరియడ్, 7 నుంచి 30 రోజుల సర్వైవల్ పిరియడ్ ఉంటుంది. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. దీంతోపాటు కేర్ హెల్త్ ఇన్సురెన్స్ వంటి మరికొన్ని బీమా సంస్థలు కూడా రూ.5 లక్షల కవరేజీతో పాలసీలను అందిస్తున్నాయి. క్యాన్సర్ నుంచి బయట పడిన నిర్దిష్ట సమయం తర్వాత హామీ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కాబట్టి మీరు పాలసీ బజార్, కవర్‌ఫాక్స్ వంటి వెబ్సైట్లలో మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ పాలసీతో పాటు రెగ్యులర్ హెల్త్ ప్లాన్‌ను కూడా మీ వివరాలను తెలియజేసి తీసుకోవచ్చు. కుటుంబ సభ్యుల విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం మంచిది.
జీవిత బీమా..
జీవిత బీమాలో టర్మ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ వంటి అనేక రకాల పాలసీలు ఉంటాయి. ఇందులో టర్మ్ పాలసీ ఉత్తమమైనది, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందిస్తుంది. పాలసీ తీసుకన్న వ్యక్తి మరణించినప్పుడు, కుటుంబ సభ్యులకు హామీ మొత్తాన్ని అందిస్తారు. కాబట్టి కుటుంబ సభ్యుల రక్షణ కోసం టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిదే. అయితే, మీరు ఇప్పటికే క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడినందున చాలా వరకు కంపెనీలు పాలసీ ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. అయితే, కొన్ని కంపెనీలు మీ వయసు, ఆదాయం వంటి వ్యక్తిగత వివరాలను పరిశీలించి అధిక ప్రీమియంతో పాలసీ ఇవ్వొచ్చు. కాబట్టి, ఒకసారి మాక్స్ బూపా, హెచ్డీఎఫ్సీ ఎర్గో, స్టార్ హెల్త్ లాంటి కంపెనీలను సంప్రదించడం మంచిది. ఒకవేళ బీమా సంస్థ నిరాకరిస్తే ఐదేళ్ల తర్వాత పాలసీ కోసం తిరిగి ప్రయత్నించండి.
గుర్తుంచుకోండి..
మీరు జీవిత, ఆరోగ్య బీమా ఏది తీసుకున్నా పాలసీలో అన్ని సరైన విషయాలను అందించండి. గత వైద్య చరిత్ర (క్లిష్టమైన అనారోగ్యాలు, బిపి, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు), అలవాట్లు (ధూమపానం వంటివి) దాచిపెట్టి పాలసీ తీసుకోవడం వల్ల క్లెయిం సమయంలో పాలసీ తిరస్కరణకు గురికావచ్చు. అందువల్ల అన్ని వివరాలను తెలియజేసి పాలసీ తీసుకోవడం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక
-
Sports News
Cricket: ఫుల్ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్
-
Movies News
Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య
-
Politics News
BRS: రైతుల తుపాన్ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్
-
Movies News
Orange: 13 ఏళ్లు అయినా.. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలే..!
-
General News
Rain Alert: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్