FD Interest rates: స్పెషల్‌ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

బ్యాంకులు ప్రత్యేక కాలవ్యవధులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాడానికి డిపాజిటర్లకు అనుమతిస్తున్నాయి. ప్రత్యేక ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి.

Published : 21 Aug 2023 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం వివిధ కాలవ్యవధులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సౌకర్యాన్ని అందిస్తాయని మనందరికీ తెలిసిందే. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను టైమ్‌ డిపాజిట్‌ లేదా టర్మ్‌ డిపాజిట్‌ అని కూడా పిలుస్తారు. అలాగే ఇప్పుడు దాదాపుగా అన్ని బ్యాంకులూ ప్రత్యేక (కాలవ్యవధి) ఎఫ్‌డీలను అందజేస్తున్నాయి. వీటిలో మధ్యలో డిపాజిట్‌ను ఉపసంహరించుకోవడానికి వీలుండదు. ఈ ప్రత్యేక డిపాజిట్లపై వడ్డీ రేటు.. సాధారణ ఎఫ్‌డీలపై లభించే వడ్డీ కంటే కాస్త ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కూడా ప్రత్యేక కాలవ్యవధి ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. రూ.5 లక్షల వరకు (వడ్డీతో కలిపి) బ్యాంకు ఎఫ్‌డీలపై డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) బీమా సౌకర్యం ఉంటుంది. 

వివిధ బ్యాంకుల ప్రత్యేక డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఈ కింది పట్టికలో చూడొచ్చు..

నోట్‌: ఈ డేటా 2023 ఆగస్టు 16 నాటిది..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని