Lava Storm 5G: 50MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో లావా 5జీ ఫోన్‌

Lava Storm 5G: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ లావా బడ్జెట్‌ ధరలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. మొబైల్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Updated : 21 Dec 2023 18:32 IST

Lava Storm 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. లావా స్టార్మ్‌ 5జీ (Lava Storm 5G) పేరుతో మొబైల్‌ను తీసుకొచ్చింది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌ సింగిల్‌ వేరియంట్‌లో వస్తోంది. 8జీబీ+ 128జీబీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద కొనుగోలు చేసిన వారికి రూ.11,999కే అందించనుంది. గేల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. డిసెంబరు 28 నుంచి లావా ఇ-స్టోర్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

ఐనాక్స్‌ ఇండియా అదుర్స్‌.. 44 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌

లావా స్టార్మ్ 5జీ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14కు అప్‌గ్రేడ్‌, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు లావా పేర్కొంది. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 5000mAh బ్యాటరీ అమర్చారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై 5, బ్లూటూత్‌ 5.0, 3.5mm ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని