Stock Market: మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట.. ఎక్కడ సూచీలు అక్కడే..

నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. చివరకు అత్యల్ప లాభాలను నమోదు చేశాయి.

Updated : 22 Aug 2023 16:09 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) మంగళవారం ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబర్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను స్తబ్దుగా మొదలుపెట్టిన సూచీలు.. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లే కన్పించాయి. కానీ, చివరి గంటల్లో మదుపర్లు అప్రమత్తత పాటించి అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి.

ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో సూచీలు అత్యల్ప లాభాన్ని దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ (Sensex) కేవలం 4 పాయింట్ల లాభంతో 65,220 వద్ద, నిఫ్టీ (Nifty) 3 పాయింట్ల లాభంతో 19,396 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలపడి 82.94గా స్థిరపడింది.

జీఎస్‌టీ రివార్డ్‌ స్కీమ్‌.. రూ.కోటి వరకు ప్రైజ్‌ మనీe

ఈ ఉదయం 65,272.42 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 65,363 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో 65,165.45 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచి.. చివరకు 3.94 పాయింట్ల లాభంతో 65,220.03 వద్ద స్థిరపడింది. అటు, నిఫ్టీ కూడా 19,381-19,443 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 2.85 పాయింట్ల లాభంతో 19,396.45 వద్ద ముగిసింది.

రంగాల వారీగా చూస్తే.. ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ మినహా అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, విద్యుత్‌ రంగ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐటీసీ, ఎన్టీపీసీ, హీరో మోటార్స్‌ షేర్లు రాణించగా.. భారత్‌ పెట్రోలియం, సిప్లా, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐషర్‌ మోటార్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని