Maruti market share: తగ్గిన మారుతీ, హ్యుందాయ్‌ మార్కెట్‌ వాటా

Maruti market share: మారుతీ సుజుకీ రిటైల్‌ విక్రయాలు 1,18,892 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం విక్రయాల్లో కంపెనీ వాటా వార్షిక ప్రాతిపదికన 42.36 శాతం నుంచి 41.40 శాతానికి తగ్గింది.

Published : 07 Mar 2023 17:08 IST

దిల్లీ: ఫిబ్రవరిలో జరిగిన వాహన విక్రయాల్లో మారుతీ సుజుకీ (Maruti Suzuki), హ్యుందాయ్‌ (Hyundai) ఇండియా వాటా తగ్గింది. అదే సమయంలో టాటా మోటార్స్‌, మహీంద్రా, కియా ఇండియా తమ మార్కెట్‌ వాటాను పెంచుకున్నాయి. వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గణాంకాల ప్రకారం.. గత నెలలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) రిటైల్‌ విక్రయాలు 1,18,892 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఇది 1,09,611గా ఉంది. అయితే, మొత్తం విక్రయాల్లో కంపెనీ వాటా మాత్రం వార్షిక ప్రాతిపదికన 42.36 శాతం నుంచి 41.40 శాతానికి తగ్గింది.

మరోవైపు హ్యుందాయ్‌ ఇండియా మార్కెట్‌ వాటా (Hyundai Market Share) 14.95 శాతం నుంచి 13.62 శాతానికి తగ్గింది. గత ఏడాది ఫిబ్రవరిలో హ్యుందాయ్ 38,688 కార్లను విక్రయించింది. ఈ సారి ఆ సంఖ్య 39,106గా నమోదైంది. టాటా మోటార్స్ గత నెలలో 38,965 కార్లను విక్రయించి వాటాను 13.57 శాతానికి పెంచుకుంది. అలాగే మహీంద్రా అండ్‌ మహీంద్రా 29,356 కార్ల విక్రయాలతో 10.22 శాతం వాటాను సొంతం చేసుకుంది. కియా ఇండియా విక్రయాలు 19,554 యూనిట్లకు చేరాయి. మార్కెట్‌ వాటా వార్షిక ప్రాతిపదికన 5.27 శాతం నుంచి 6.81 శాతానికి పెరిగింది. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ విక్రయాల వాటా సైతం ఫిబ్రవరిలో పుంజుకుంది. హోండా కార్స్‌, రెనో, ఎంజీ మోటార్‌, నిస్సాన్‌ వాటా తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని