Maruti Suzuki: మారుతీ సుజుకీ దసరా ఆఫర్లు.. ఈ మోడల్స్‌పై ₹68 వేలు డిస్కౌంట్‌!

Maruti Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ దాదాపు అన్ని మోడల్‌ కార్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. వాటి వివరాలపై ఓ లుక్కేయండి.

Published : 11 Oct 2023 23:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పండగ సీజన్‌ ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ  (Maruti Suzuki) దాదాపు అన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ‘ప్రీ-నవరాత్రి’ బుకింగ్ స్కీమ్‌లో భాగంగా ఇగ్నిస్‌ (Ignis), సియాజ్‌(Ciaz), బాలెనో (Baleno) వంటి కార్ల బుకింగ్‌పై రూ.5వేల వరకు రాయితీని అందిస్తోంది. అయితే ఈ స్కీమ్‌ అక్టోబర్‌ 15వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొన్ని కార్లపై ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌లు, కొర్పొరేట్‌ ప్రయోజనాలు, నగదు తగ్గింపులను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా కొన్ని మోడల్స్‌పై అత్యధికంగా రూ.68 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది.

ముకేశ్‌ అంబానీ ఇంటికి ఐఓసీ అధ్యక్షుడు

Dzire: మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్‌ వాహనం డిజైర్‌పై రూ.17 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ సీఎన్‌జీ (CNG) వేరియంట్‌కు వర్తించదు. ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.6.51లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Brezza: మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌తో మార్కెట్‌లోకి వచ్చిన మైల్డ్-హైబ్రిడ్ టెక్ బ్రెజ్జాపై రూ.45 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. సీఎన్‌జీ (CNG) వేరియంట్‌పై కూడా రూ.20 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ వాహనం ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.8.29 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.

Swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై రూ.47 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇక సీఎన్‌జీ వేరియంట్‌పై దాదాపు రూ.33 వేల వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. స్విఫ్ట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.5.99లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Ciaz: మారుతీ సుజుకీ సియాజ్ పై రూ.53 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే సీఎన్‌జీ వేరియంట్‌పై ఎటువంటి డిస్కౌంట్‌ అందించటం లేదు. సియాజ్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.9.30 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.

Baleno: సెప్టెంబరులో ఎక్కువ మంది కొనుగోలు చేసిన కార్ల జాబితాలో బాలెనో కూడా ఒకటి. బాలెనో సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 55వేలు, స్టాండర్డ్ ఇంజన్‌పై రూ.40 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6.61 లక్షలుగా మారుతీ నిర్ణయించింది.

WagonR: ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.5.54 లక్షలుగా ఉండే వేగనార్‌ వాహనంపై రూ.58 వేల వరకు డిస్కౌంట్‌ అందించనుంది.

Ignis: నెక్సా విభాగంలో చివరిదైన ఇగ్నిస్‌ పై అత్యధికంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్‌ అందించనుంది. ఈ కార్‌ సీఎన్‌జీ వేరియంట్‌లో అందుబాటులో లేదు. అయితే  ఆటోమేటిక్‌ వేరియంట్‌పై రూ.60 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇగ్నిస్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.84 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇవే కాకుండా మారుతీ సుజుకీకి చెందిన ఆల్టో కే10 (Alto K10), ఎస్‌ ప్రెస్సో (S Presso), సెలెరియో (Celerio).. ఈ మూడు మోడల్లపై అత్యధికంగా రూ.68 వేలు డిస్కౌంట్‌ అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని