Motorola G24: బిగ్‌ బ్యాటరీతో మోటో కొత్త ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

Moto G24 Power: మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరోలా తన ‘జీ’ సిరీస్‌లో బడ్జెట్‌ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Published : 31 Jan 2024 01:57 IST

Moto G24 Power | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మోటో జీ24 పవర్‌ (Moto G24 Power) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ‘జీ’ సిరీస్‌లో బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటివి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు.

మోటో కొత్త ఫోన్‌ (Moto G24 Power) రెండు వేరియంట్స్‌లో వస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.8,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ +128 జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా పేర్కొంది. గ్లేసియర్‌ బ్లూ, ఇంక్‌ బ్లూ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌, మోటోరొలాతో పాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, ఈఎంఐ సదుపాయం అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

విలీన ఒప్పందం రద్దు.. సోనీకి NCLT నోటీసులు

ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 6.56 అంగుళాల హెచ్‌డీ + ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్‌ రేటు, 537 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ అమర్చారు. కెమెరా పరంగా చూసుకుంటే.. వెనుక వైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 6,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఈ ఫోన్‌ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని