Stock market: ఆఖర్లో కొనుగోళ్లు.. భారీ లాభాల్లో సెన్సెక్స్‌.. నిఫ్టీ 18000+

Stock market closing bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో వంటి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది.

Published : 28 Apr 2023 15:55 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఈ వారంలో అన్ని ట్రేడింగ్‌ సెషన్లలోనూ సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, విప్రో వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చాయి. ఉదయం లాభనష్టాల మధ్య సూచీలు కదలాడినప్పటికీ.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 460 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 18వేల మార్కుకు ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.81గా ఉంది. 

సెన్సెక్స్‌ శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో 60,721.61 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. కాసేపటికి తిరిగి లాభాల్లోకి వచ్చినప్పటికీ.. స్వల్ప లాభాల్లోనే కదలాడింది. చివరి అరగంటలో కీలక షేర్లలో కొనుగోళ్లు సెన్సెక్స్‌ను భారీ లాభాలవైపు నడిపించాయి. ఇంట్రాడేలో 61,209.46 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 463 పాయింట్ల లాభంతో 61,112.44 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 149.95 పాయింట్ల లాభంతో 18,065.00 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో విప్రో, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ స్వల్పంగా నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని