ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు సబ్సిడీ ఇక లేనట్లేనా? ముగియనున్న ఫేమ్-2 గడువు

EV subsidy: ఫేమ్‌-2 గడువు త్వరలో ముగియనుంది. మున్ముందు విద్యుత్‌ టూవీలర్లకు సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది.

Updated : 18 Dec 2023 15:18 IST

EV subsidy | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండో దశ (FAME-2) గడువు త్వరలో ముగియనుంది. టూవీలర్లు సహా మిగిలిన విద్యుత్‌ వాహనాలకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వచ్చింది. మరికొన్ని వారాల్లో దీని గడువు ముగియనున్న వేళ టూవీలర్‌ సబ్సిడీని ఇక మీదట పొడిగించకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

ఫేమ్‌-1కు కొనసాగింపుగా ఫేమ్‌-2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1న కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ కొనుగోళ్లపై సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు. గతంలో ఒక కిలోవాట్‌కు సబ్సిడీ ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.10 వేలకు కుదించింది. ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. పథకాన్ని పొడిగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ, ఇతర మంత్రిత్వ శాఖలు మాత్రం విముఖత చూపుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. 

Jio TV: జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. సింగిల్‌ ప్లాన్‌పై 14 ఓటీటీలు

ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌కు సబ్సిడీని తగ్గించిన తర్వాత కొన్నాళ్ల పాటు అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. సబ్సిడీ లేకపోయినా టూవీలర్‌ అమ్మకాలు వాటంతట అవే పెరుగుతాయని, పెట్రోల్‌ ధరలు అధికంగా ఉండడం వల్ల వాహనదారులు అటుగా మళ్లుతారని అధికార వర్గాల వాదన. మరోవైపు ఫేమ్‌-2 రాయితీ విషయంలో చోటు చేసుకున్న అవకతవకలూ సబ్సిడీ కొనసాగించకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించేందుకు మరో కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని