Ola Electric: ఓలా ఇయర్‌ ఎండ్‌ ఆఫర్‌ .. ఈ స్కూటర్‌పై రూ.20వేల డిస్కౌంట్‌!

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి తయారీ సంస్థ గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా కొన్ని స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

Published : 16 Dec 2023 17:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లు తీసుకొచ్చింది. ఓలా ఎస్‌1 ఎయిర్‌ (S1 Air), ఓలా ఎస్‌1 ఎయిర్‌ ప్రో (S1 Pro) కొనుగోలుపై రూ.10 వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటూ ఓలా ఎస్‌1 ఎక్స్‌+ (Ola S1 X+)పై రూ.20వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఆఫర్‌ ప్రారంభం కాగా.. డిసెంబరు 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

‘అది కఠిన నిర్ణయం’.. లేఆఫ్‌లపై సుందర్‌ పిచాయ్‌!

ఓలా ఎస్‌1 శ్రేణిలో.. ఎస్‌1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో పేరిట తీసుకొచ్చిన రెండు స్కూటర్లపై రూ.5వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఓలా ఎస్‌1 ప్రో స్కూటర్‌కు అదనంగా ఐదేళ్ల బ్యాటరీ వారెంటీని ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రెడిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ఈఎంఐ సాయంతో కొనుగోలు చేసిన వాళ్లు అదనంగా రూ.5వేలు డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది. ఈ రెండు ఆఫర్లతో కలిపి మొత్తం రూ.10వేల వరకు తగ్గింపు పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా వీటి కొనుగోలుపై జీరో డౌన్‌ పేమెంట్‌ ఛార్జీ, జీరో ప్రాసెసింగ్‌ ఫీ వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని