OnePlus: స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 12.. సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లివే..

వన్‌ప్లస్‌ (OnePlus) సంస్థ నుంచి వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. వీటితోపాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 (OnePlus Buds 3) వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసింది.

Published : 24 Jan 2024 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్‌ప్లస్‌ (OnePlus) నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి. ‘స్మూత్‌ బియాండ్‌ బిలీఫ్‌’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో కొత్తగా వన్‌ప్లస్‌ 12 (OnePlus 12), వన్‌ప్లస్‌ 12ఆర్‌ (OnePlus 12R) స్మార్ట్‌ఫోన్‌లను సంస్థ లాంచ్‌ చేసింది. వీటితోపాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 (OnePlus Buds 3) వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసింది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌.. 512 జీబీ స్టోరేజీ..

వన్‌ప్లస్‌ 12 మొబైల్‌లో 6.82 అంగుళాల 2కే ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ కల్పించారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పని చేస్తుంది. శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. వెనుకవైపు మూడు కెమెరాలు.. 50 ఎంపీ, 48 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 64 ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫొటో జూమ్‌ లెన్స్‌ ఉన్నాయి. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5400 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 100 వాట్‌ సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50 వాట్‌ వైర్‌లెస్‌, 10 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

12 జీబీ, 256 జీబీ వేరియంట్‌ ధర రూ.64,999. 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ విషయానికొస్తే ధరను రూ.69,999గా నిర్ణయించారు. సిల్కి బ్లాక్‌, ఫ్లోయి ఎమరాల్డ్‌ రంగుల్లో లభ్యమవుతాయి. జనవరి 30 నుంచి మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

5500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 12ఆర్‌..

వన్‌ప్లస్‌ 12ఆర్‌లో 6.78 అంగుళాల 1.5కే ఎల్‌టీపీఓ అమోలెడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది కూడా 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 2 ప్రాసెసర్‌ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చింది. ఈ ఫోన్‌లో వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉన్నాయి. 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 100 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

WhatsApp: వాట్సాప్‌లోనూ ‘నియర్‌బై షేర్‌’ ఫీచర్‌!

8 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌ ధర రూ.39,999. 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మోడల్‌ ధర రూ.45,999. కూల్‌ బ్లూ, ఐరన్‌ గ్రే రంగుల్లో లభ్యమవుతాయి. ఫిబ్రవరి 6 నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.

44 గంటల వినియోగంతో బడ్స్‌ 3

వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌లో డ్యూయల్‌ డ్రైవర్‌ సెటప్‌ (10.4 ఎంఎం వూఫర్‌, 6 ఎంఎం ట్వీటర్) ఉంది. డ్యుయల్‌ కనెక్షన్‌ మోడ్‌లో రెండు ఫోన్‌లను ఒకేసారి కనెక్ట్‌ చేయొచ్చు. ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టి 44 గంటలపాటు వినియోగించొచ్చు. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7 గంటల బ్యాటరీ లైఫ్‌ లభిస్తుంది. ఇవి బ్లూటూత్‌ 5.3 ఆధారంగా పని చేస్తాయి. 94ఎంఎస్‌ లో లేటెన్సీ మోడ్‌తో పని చేస్తాయి. ధరను రూ.5,499గా నిర్ణయించారు. మెటాలిక్‌ గ్రే, స్ప్లెండిడ్‌ బ్లూ రంగుల్లో లభ్యమవుతాయి. ఇవి ఫిబ్రవరి 6 నుంచి అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని