WhatsApp: వాట్సాప్‌లోనూ ‘నియర్‌బై షేర్‌’ ఫీచర్‌!

ఆండ్రాయిడ్ నియర్‌బై షేర్‌, యాపిల్‌ ఎయిర్‌ డ్రాప్‌ తరహా ఫీచర్‌ వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. 

Published : 22 Jan 2024 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారులకు మెరుగైన ఫీచర్లు అందించడంలో భాగంగా వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త వాటిని పరిచయం చేస్తుంది. గతేడాది హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలు/వీడియోలను ఇతరులకు పంపేందుకు వీలుగా 2జీబీ ఫైల్‌ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కొత్తగా మరో ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ‘నియర్‌బై షేర్‌’, ఐఓఎస్‌ ‘ఎయిర్‌ డ్రాప్‌’ తరహాలో ఇది పనిచేస్తుంది. దీంతో పక్కనే ఉన్నవారికి ఇంటర్నెట్‌ అవసరం లేకుండా ఫైల్స్‌ బదిలీ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉన్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో (Wabeta Info) వెల్లడించింది.

గతంలో ఫొటో/ఆడియో/వీడియో/డాక్యుమెంట్ షేరింగ్‌ కోసం ‘షేర్‌ ఇట్‌’ యాప్‌ను ఉపయోగించేవారు. దానిపై కేంద్రం నిషేధం విధించడంతో గూగుల్‌ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో నియర్‌బై షేర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఒకేసారి ఒకరి కన్నా ఎక్కువ మందికి ఫైల్స్‌ పంపొచ్చు. ఎలాంటి కేబుల్స్‌, నెట్‌వర్క్‌ అవసరం లేకుండా డివైజ్‌ టు డివైజ్‌ కనెక్టివిటీతో ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. ఈతరహా ఫీచర్‌ను వాట్సాప్‌ ‘పీపుల్‌ నియర్‌బై’గా పరిచయం చేయనుంది. యూజర్ల గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా ఇందులో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఇస్తున్నట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది. ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి డివైజ్‌ను కదిపితే.. షేర్‌ రిక్వెస్ట్‌ వెళుతుంది. దానికి ఆమోదం తెలిపితే.. ఫైల్‌ షేరింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు