OnePlus New Gadgets: 50 ఎంపీ కెమెరా, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌.. వన్‌ప్లస్‌ కొత్త మొబైల్స్‌!

వన్‌ప్లస్ నార్డ్‌ సమ్మర్‌ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో.. కొత్తగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది.వన్‌ ప్లస్‌ నుంచి నార్డ్‌ (OnePlus Nord) సిరీస్‌ కొత్త ఫోన్లు వచ్చేశాయి. దాంతోపాటు నార్డ్‌ బడ్స్‌(Nord Buds)ను కూడా లాంచ్‌ చేశారు. 

Published : 06 Jul 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ధర, ప్రీమియం లుక్స్‌తో నార్డ్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ (Oneplus Nord) కొత్త మొబైల్స్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ నార్డ్‌ సమ్మర్‌ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో.. కొత్తగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. వీటితోపాటు వన్‌ప్లస్‌ బులెట్‌ వైర్‌లెస్‌ జెడ్‌ 2, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌లను కూడా ఆవిష్కరించింది. 

డిమెన్సిటీ 9000తో...

నార్డ్‌ 3 5జీ మొబైల్‌లో 6.74 అంగుళాల ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పని చేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ డిమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ 13.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్‌ వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 50 ఎంపీ మెయిన్‌ కెమెరా కాగా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ఉంటుంది. మాక్రో సెన్సార్‌గా 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తారు. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 80 వాట్‌ సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ బేస్‌ వేరియంట్‌గా 8 జీబీ, 128 జీబీ వేరియంట్‌ తీసుకొస్తున్నారు. దీని ధర రూ. 33,999. ఇక 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ విషయానికొస్తే ధరను రూ.37,999గా నిర్ణయించారు. జులై 15 నుంచి ఈ మొబైల్స్‌ అందుబాటులోకి వస్తాయి. 

స్నాప్‌డ్రాగన్‌ 782జీతో...

నార్డ్‌ సీఈ 3లో 6.7 అంగుళాల ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది కూడా 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌ ఇస్తున్నారు. ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1తో ఈ మొబైల్‌ పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తుంది.  ఈ ఫోన్‌లో వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌  కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మాక్రో సెన్సర్‌ ఉంటాయి. 

Also Read: యూపీఐ సదుపాయంతో నోకియా కొత్త ఫీచర్‌ ఫోన్లు

ఈ మొబైల్‌లో ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తారు. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా 80 వాట్‌ సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉన్న నార్డ్‌ సీఈ 3  ధర రూ. 26,999. ఇక ఇదే సిరీస్‌లో 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మోడల్‌ ధర రూ. 28,999. 

బ్లూటూత్‌ 5.3తో...

నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌లో 12.4 ఎంఎం డ్రైవ్స్‌ ఉంటాయి. ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టి 38 గంటలపాటు వినియోగించొచ్చు. ఇవి బ్లూటూత్‌ 5.3 ఆధారంగా పని చేస్తాయి. 94ఎంఎస్‌ లో లేటెన్సీ మోడ్‌తో పని చేస్తాయి. వీటి ధరను రూ. 2,199గా నిర్ణయించారు. అలాగే యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తున్న బులెట్స్‌ వైర్‌లెస్‌ ధర రూ. 2,299.  అయితే ఇవి ఆగస్టు నుంచి అందుబాటులో ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని