Poco C65: 50MP కెమెరాతో ‘పోకో’ కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లివే..!

Poco C65: మొబైల్‌ తయారీ కంపెనీ పోకో.. తన సి-సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ని భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Published : 15 Dec 2023 14:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘పోకో’ సీ65 (Poco C65) పేరిట మరో కొత్త ఫోన్‌ని లాంచ్‌ చేసింది. 5,000 mAh బ్యాటరీ సదుపాయంతో బడ్జెట్‌ ధరలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్‌ స్టోరేజీని 128జీబీ నుంచి  మైక్రో ఎస్‌డీ కార్డు సాయంతో 256జీబీ వరకు పెంచుకోవచ్చు. 

పోకో కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.10,999గా పేర్కొంది. మ్యాట్‌ బ్లాక్‌, పాస్టెల్ బ్లూ.. వర్ణాల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. పోకో వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.1,000 డిస్కౌంట్‌ అందించనుంది. ఈఎంఐ అవకాశం కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

ఫెడ్‌ తెచ్చిన లాభోత్సాహం

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 13 (Android 13) ఎమ్‌ఐయూఐ 14తో పనిచేస్తుంది. 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ సాంప్లింగ్‌ రేట్‌తో వస్తోంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఇచ్చారు. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ మైక్రో కెమెరా ఇచ్చారు. వీడియో కాల్‌, సెల్ఫీ కోసం ముందుభాగంలో 8ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000 mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి సదుపాయాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని