Post office: పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌తో నెలవారీ ఎంత పొందొచ్చు?
ప్రభుత్వం 2023, జనవరి-మార్చి త్రైమాసికానికి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వడ్డీ రేటును 7.10%కు పెంచింది.
ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడులకు భద్రత కల్పిస్తూ.. స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం చూసే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (PO-MIS) మంచి ఎంపిక. ఈ పథకం వడ్డీ రేటును ఇటీవలే ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు నెలవారీ ఎంత ఆదాయం పొందగలరో ఇప్పుడు చూద్దాం.
- పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. ప్రభుత్వం 2023, జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ రేటును 7.10%కు పెంచింది. ఇంతకు ముందు త్రైమాసికంలో 6.60%గా ఉండేది.
- ఈ పథకంలో వ్యక్తిగతంగా కనీసం రూ.1000 నుంచి రూ.4.50 లక్షల వరకు, జాయింటుగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాలు నిండిన మైనర్ల పేరుపై కూడా ఈ పథకంలో రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా మేజర్ ఖాతాగా మారుతుంది.
- ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠ పరిమితి వరకు.. అంటే రూ. 4.50 లక్షల వరకు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం నెలవారీగా రూ.2,662 పొందొచ్చు. అంటే, 5 సంవత్సరాల్లో రూ.1,59,720 వడ్డీ ఆదాయం వస్తుంది.
- ఒకవేళ జాయింట్ ఖాతా అయితే గరిష్ఠ పరిమితి రూ.9 లక్షలు. ఈ పరిమితి వరకు పెట్టుబడి పెడితే నెలవారీగా రూ.5,324 ఆదాయం పొందొచ్చు. ఐదేళ్ల కాలంలో రూ.3,19,440 వడ్డీ లభిస్తుంది.
- మైనర్ పేరుపై గరిష్ఠ పరిమితి (రూ.3 లక్షల) వరకు పెట్టుబడి పెడితే, ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం నెలవారీగా రూ.1,775 లభిస్తుంది. అంటే ఐదేళ్లలో రూ.1,06,500 వడ్డీ వస్తుంది.
ఈ పథకం ఇతర ముఖ్య ఫీచర్లు..
రెగ్యులర్ పేమెంట్స్: ఈ పథకంలో పెట్టుబడి పెట్టినవారు నెలవారీగా కచ్చితమైన ఆదాయం పొందుతారు.
తక్కువ రిస్క్: ప్రభుత్వ హామీ గల పథకం. కాబట్టి 0% రిస్క్‌తో వస్తుంది.
లాక్-ఇన్-పీరియడ్: ఈ పథకంలో 5 సంవత్సరాల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. ఈ కాలవ్యవధి పూర్తయిన తర్వాత పెట్టుబడిదారులు తమ అభీష్టానుసారం తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.
ఖాతాలు: ఖాతాను వ్యక్తిగతంగా, జాయింటుగా (గరిష్ఠగా ముగ్గురు వ్యక్తులు), మైనర్ ఖాతా (10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై) తెరవొచ్చు. ఒకే ఖాతా తెరవాలనే నిబంధన లేదు. కానీ, ఒక ఖాతాలో ఎంత వరకు జమ చేయవచ్చనే దానిపై పరిమితి ఉంది.
ముందస్తు విత్‌డ్రాలు: ముందస్తు విత్‌డ్రాలను అనుమతిస్తారు. అయితే కొంత పెనాల్టీ వర్తిస్తుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత ముందస్తు విత్‌డ్రాలను అనుమతిస్తారు. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత/ మూడేళ్ల ముందు విత్‌డ్రా చేస్తే 2%, మూడేళ్ల తర్వాత/ఐదేళ్లకు ముందు అయితే 1% పెనాల్టీ వర్తిస్తుంది.
ఖాతా బదిలీ: పోస్టాఫీసు ఎంఐఎస్ ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి దేశంలో ఏదైనా పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!