Jio: క్రికెట్ అభిమానుల కోసం జియో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌

మార్చి 31 నుంచి ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు ప్రారంభంకానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను (Prpeiad Plans) పరిచయం చేసింది. 

Updated : 24 Mar 2023 17:22 IST

ముంబయి: రిలయన్స్ జియో (Reliance Jio) క్రికెట్ అభిమానుల (Cricket Fans) కోసం మూడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను (Prepaid Plans) తీసుకొచ్చింది. వీటిలో రోజువారీ 3 జీబీతోపాటు అదనంగా 2 జీబీ నుంచి 40 జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది. వాటి ధరలను రూ. 999, రూ. 399, రూ. 219గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నుంచి ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్‌లను పరిచయం చేసినట్లు జియో వెల్లడించింది. మార్చి 24 నుంచి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.  ఈ ప్లాన్‌ల పూర్తి వివరాలు.

రూ. 999తో రీఛార్జ్‌ చేసుకున్నయూజర్లకు రోజువారీ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ సదుపాయంతోపాటు రూ. 241 విలువైన వోచర్‌ను ఇస్తున్నారు. ఈ వోచర్‌తో యూజర్లకు 40 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ  84 రోజులు. ఇక, రూ. 399తో రీఛార్జ్‌ చేస్తే  28 రోజులు వ్యాలిడిటీతో రోజువారీ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తోపాటు రూ. 61 విలువైన వోచర్ లభిస్తుంది. దీంతో 6జీబీ డేటాను యూజర్లు పొందొచ్చు. రూ. 219 రీఛార్జ్‌తో రోజువారీ 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌పాటు అదనంగా 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులు.  

ఈ ప్లాన్‌తోపాటు క్రికెట్‌ డేటా యాడ్‌-ఆన్‌ ప్లాన్‌లను కూడా జియో ప్రకటించింది. సాధారణ రీఛార్జ్‌కు అదనంగా రూ. 222తో రీఛార్జ్‌ చేసుకుంటే 50 జీబీ డేటా పొందొచ్చు. సాధారణ రీఛార్జ్‌ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు ఈ డేటా యూజర్‌కు అందుబాటులో ఉంటుంది. రూ. 444తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ. 667తో రీఛార్జ్ చేసుకున్న వారు 150 జీబీ డేటా పొందుతారు. దీని వ్యాలిడిటీ 90 రోజులు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని