Jio Book: రూ.16,499కే కొత్త జియో బుక్‌.. ఫీచర్లు ఇవే..!

రిలయన్స్ జియో (Jio) ఫ్టస్‌ లెర్నింగ్‌ బుక్‌ కాన్సెప్ట్ పేరుతో మరో కొత్త మోడల్‌ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. కొనుగోలు సమయంలో ల్యాప్‌టాప్‌తోపాటు అదనపు ఫీచర్లను కూడా ఇస్తోంది.

Published : 01 Aug 2023 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్ జియో (Jio) మరో కొత్త మోడల్‌ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన జియో బుక్‌కు కొనసాగింపుగా కొత్త జియో బుక్ (2023) (Joi Book 2023)ని పరిచయం చేసింది. బ్లూ రంగులో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను దేశంలోనే ఫస్ట్‌ లెర్నింగ్‌ బుక్‌ (First Learning Book)గా జియో చెబుతోంది. మరి, జియో బుక్‌ (2023)లో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం. 

జియో బుక్‌ ఫీచర్లు 

ఈ ల్యాప్‌టాప్‌లో 11.6-అంగుళాల యాంటీ గ్లేర్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. జియో ఓఎస్‌, మీడియాటెక్‌ MT 8788 ఆక్టాకోర్ 64-బిట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 జీబీ LPDDR4 ర్యామ్‌/64 జీబీ ఫ్లాష్‌ మెమొరీ ఉంది. మెమొరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. వీడియో కాలింగ్ కోసం 2ఎంపీ హెచ్‌డీ హెచ్‌ కెమెరా ఇస్తున్నారు. ARM Mali G72 గ్రాఫిక్‌ కార్డ్ అమర్చారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తుందని జియో చెబుతోంది. వైఫై కనెక్టివిటీతోపాటు, 4జీ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది. గతేడాది విడుదల చేసిన ల్యాప్‌టాప్‌ మోడల్‌ బరువు 1.2 కేజీలు కాగా.. తాజాగా విడుదల చేసిన జియో బుక్‌ బరువు కేవలం 999 గ్రాములే. ఇన్ఫినిటీ కీబోర్డ్‌, పెద్ద ట్రాక్‌పాడ్‌, Jio+F ఫుల్‌స్క్రీన్‌ మోడ్, స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

జియో బుక్‌ (2023) ధర రూ.16,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరకు అదనంగా క్విక్‌ హీల్ యాంటీ వైరస్‌ సబ్‌స్క్రిప్షన్‌, ల్యాప్‌టాప్‌ కేస్‌, ఏడాదిపాటు 100 జీబీ డీజీబాక్స్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ ఉచితంగా ఇస్తోంది. ఆగస్టు 5 నుంచి రిలయన్స్ డిజిటల్‌తోపాటు అమెజాన్‌లో కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని