WhatsApp: వాట్సాప్‌లో యాడ్స్‌ రానున్నాయా? కంపెనీ ఏమందంటే?

WhatsApp: ఇకపై వాట్సాప్‌ వినియోగించే సమయంలో యాడ్స్‌ రానున్నాయంటూ వార్తలు రావటంపై యాజమాన్యం స్పందించింది.

Updated : 15 Sep 2023 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ (WhatsApp)లో ఇకపై యాడ్స్‌ రానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి మీడియా కథనాలు. చాట్‌ స్క్రీన్‌పై యాడ్స్‌ తీసుకురావటంపై వాట్సాప్‌ యోచిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు బయటకు వచ్చాయి. ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తోందంటూ కథనాలు వెలువడ్డాయి. దీన్ని వాట్సాప్‌ ఖండించింది.

‘వాట్సాప్ చాట్‌ స్క్రీన్‌పై ప్రకటనలు చూపించాలా? వద్దా? అనే అంశంపై మెటా సభ్యులు చర్చిస్తున్నారు. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. దీంతో పాటూ యాడ్‌-ఫ్రీ యాప్‌ను ఉపయోగించటానికి మెటా సబ్‌స్క్రిప్షన్‌ డబ్బులు వసూలు చేయాలని యోచిస్తోంది’ అంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై వాట్సాప్‌ హెడ్‌ విల్‌ క్యాథ్‌కార్ట్‌ స్పందించారు. ‘వాట్సాప్‌ యాడ్స్‌పై వచ్చిన కథనాలు అవాస్తవం. మేము అలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అంటూ  ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.  అలాగే వాట్సాప్‌పై వస్తున్న ఈ వాదనలన్నీ కొట్టిపారేశారు.

ఈ చిట్కాలతో క్రెడిట్‌ ప్రొఫైల్ను మెరుగుపర్చుకుందాం!

ఇదిలా ఉండగా.. వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ (WhatsApp Channels) సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇది వన్‌వే ఛానెల్‌ లాంటిది. దీంతో ఒకే సారి పెద్ద సంఖ్యలో సందేశాలు పంపిచొచ్చు. ఇది సాధారణ చాట్‌ కంటే కాస్త మెరుగైనది. మీరు కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన అప్‌డేట్‌లను ఈ ఛానెల్స్‌ ద్వారా పొందవచ్చు. ఇలా ఫాలో అయ్యే వారి వివరాలు ఇతర ఫాలోవర్స్‌కు తెలియవు. అంటే అచ్చం బ్రాడ్‌కాస్ట్‌ టూల్‌లా ఇది పనిచేస్తుంది. వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని