Google vs CCI: సుప్రీం తీర్పును సమీక్షిస్తున్నాం.. సీసీఐ జరిమానాపై గూగుల్‌

Google on Supreme order: సుప్రీంకోర్టు ఆదేశాలను సమీక్షిస్తున్నామని గూగుల్‌ తెలిపింది. సీసీఐతో కలిసి ముందుకెళ్లనున్నట్లు పేర్కొంది.

Published : 20 Jan 2023 13:26 IST

దిల్లీ: కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) విధించిన జరిమానా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గూగుల్‌ (Google) స్పందించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను సమీక్షిస్తామని ఆ కంపెనీ తెలిపింది. తీర్పును అప్పీల్‌ చేసే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ముదుకెళ్లనున్నట్లు పేర్కొంది.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించి గూగుల్‌ గుత్తాపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ.1337 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT)ను గూగుల్‌ ఆశ్రయించింది. అక్కడా ఎలాంటి ఊరటా లభించకపోవడంతో సుప్రీంకోర్టు తలుపుతట్టింది. అక్కడా గూగుల్‌కు చుక్కెదురైంది. జరిమానా మొత్తంలో 10 శాతాన్ని చెల్లించాలంటూ వారం రోజులు గడువు ఇచ్చింది. సీసీఐ ఆదేశాలపై గూగుల్‌ చేసిన విజ్ఞప్తికి సంబంధించి ఈ ఏడాది మార్చి 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్‌సీఎల్‌ఏటీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ తన స్పందనను తెలియజేసింది. ఇప్పటికీ యూజర్ల, భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని