Stock Market: 2024 తొలి రోజున.. మార్కెట్లకు స్వల్ప లాభాలు

Stock Market Closing Bell: న్యూఇయర్‌ రోజున దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 31 పాయింట్లు, నిఫ్టీ అత్యల్పంగా 10 పాయింట్ల లాభపడ్డాయి.

Published : 01 Jan 2024 16:04 IST

ముంబయి: నూతన సంవత్సరం తొలి రోజున దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. మార్కెట్లను ప్రభావితం చేసే అంతర్జాతీయ సంకేతాలు పెద్దగా లేకపోవడం, దేశీయంగా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి.

ఈ ఉదయం 72,218 వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌ (Sensex) ఒక దశలో 72,031 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త తేరుకున్న సూచీ 72,561 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సెన్సెక్స్‌ చివరకు 31.68 పాయింట్ల లాభంతో 71,271.94 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) కూడా 21,680 - 21,834 మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 10.50 పాయింట్ల స్వల్ప లాభంతో 21,741.90 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు క్షీణించి రూ. 83.24గా ముగిసింది.

కొత్త ఏడాది నుంచి వచ్చే కీలక ఆర్థిక మార్పులివే..

నిఫ్టీలో నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా షేర్లు రాణించగా.. ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, హిందాల్కో షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. రంగాల వారీగా.. హెల్త్‌కేర్‌, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సూచీలు 0.5శాతం మేర లాభపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని