కస్టమర్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన స్విగ్గీ.. వీడియో వైరల్‌..

Swiggy Instamart: నిత్యావసర సరుకులు డెలివరీ చేసే ప్రముఖ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తన కస్టమర్‌కు ప్రత్యేక బహుమతి అందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైలర్‌గా మారింది.

Published : 30 Dec 2023 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఏడాది ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక సంస్థలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా నిత్యావసర సరుకులు అందించే సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ (Swiggy Instamart) కూడా తన కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ బహుమతులు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఓ కస్టమర్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తన కస్టమర్లతో ‘ఎక్స్‌’ ద్వారా ముచ్చటించింది. ‘ఈ ఏడాదిలో మీ బకెట్ లిస్ట్‌లో పూర్తి కాని అంశాన్ని మాతో పంచుకోండి. దాన్ని నెరవేర్చటానికి ప్రయత్నిస్తాం’ అంటూ సంస్థ ‘ఎక్స్‌’ లో పోస్ట్‌ చేసింది. దీంతో పెద్ద ఎత్తున యూజర్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. అందులో హిమాన్షు బన్సల్‌ అనే వ్యక్తి ‘నేను నిజంగా ఈ ఏడాది హాట్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని కామెంట్‌ చేశాడు. ఈ ఫన్నీ కామెంట్‌ని ఎంపిక చేసిన సంస్థ ఆ కస్టమర్‌కు నచ్చినట్లుగానే బహుమతి అందించాలని ప్లాన్‌ చేసింది. దీని కోసం ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌, పూల దండలను సిద్ధం చేసి డెలివరీ బాయ్‌తో ఇంటికి పంపింది.

డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ కంటే.. దీర్ఘకాలిక పెట్టుబడులే మేలు

హిమాన్షు డోర్‌ తెరవగానే ఇంటిబైట మ్యూజిక్‌ బ్యాండ్‌ సందడి కనిపించటంతో అతనికి ఏం అర్థం కాలేదు. తర్వాత డెలివరీ బాయ్‌ వచ్చి పూల హారం వేసి ‘రూమ్‌ హీటర్‌’ను చేతిలో పెట్టాడు. దాన్ని చూసిన కస్టమర్‌ ఆశ్చర్యపోయి నవ్వుతూ తన బహుమతిని స్వీకరించాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టామార్ట్‌ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. అంతే ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 41వేల మంది వీక్షించారు. ఇన్‌స్టామార్ట్‌ చేసిన పనికి చాలా మంది ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని