Post office schemes: పన్ను ప్రయోజనాలు అందించే 5 పోస్టాఫీస్ పథకాలివే..
Postal schemes: పన్ను ప్రయోజనాలు పొందేందుకు మంచి స్కీమ్ కోసం చూస్తుంటే పోస్టాఫీసు అందిస్తున్న పథకాలను పరిశీలించొచ్చు. అదనంగా వీటి నుంచి రాబడిని సైతం పొందొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు (Post office) పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పొదుపు చేయడంతో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలను (Tax saving) పొందొచ్చు. అలా మంచి రాబడితో పాటు పన్ను ప్రయోజనాలను అందించే పథకాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రజా భవిష్య నిధి (PPF)
దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో పాటు..‘ఈఈఈ’ కేటగిరీలో పీపీఎఫ్ పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఖాతాలో కనీసం రూ.500 నుంచి ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. మైనర్ల పేరుపైనా ఖాతా తెరవొచ్చు. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.10%. ఈ పథకంలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబడులను ఉపసంహరించుకోలేరు. అయితే, ఖాతా తెరిచిన మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణం తీసుకునేందుకు వీలుంటుంది. 7వ సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు. ఖాతాలో చేసిన డిపాజిట్లపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన(SSY)..
ఈ పథకం ప్రత్యేకించి ఆడపిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించింది. 10 ఏళ్ల లోపు ఆడపిల్లల పేరుపై ఈ ఖాతా తెరవొచ్చు. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60%. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ ఖాతాకు 21 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నియమ నిబంధనలను అనుసరించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే వడ్డీ గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు.
5-ఏళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్..
5 సంవత్సరాల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే 5 ఏళ్ల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లపై కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ప్రస్తుతం త్రైమాసికానికి 5-ఏళ్ల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ రేటు 7 శాతానికి పెంచారు. ఇంతకు ముందు త్రైమాసికంలో ఇది 6.70%గా ఉండేది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)..
ప్రస్తుతం ఎన్ఎస్సీ పెట్టుబడులపై 7% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)..
60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసువారు ఇందులో చేరవచ్చు. ఈ పథకంలో రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు ఎంతైనా.. ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న పథకాల్లో అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్న పథకం ఇది. ప్రస్తుతం వార్షికంగా 8% వడ్డీ రేటు అందిస్తోంది. ఈ పథకంలో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమవుతుంది. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
గుర్తుంచుకోండి..
సెక్షన్ 80సి కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పరిమితి ఉంది. కాబట్టి అన్ని పథకాల్లో పెట్టుబడులపై కలిపి రూ.1.50 లక్షల వరకు మాత్రమే మినహాయింపు పొందే వీలుంది. పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM Jagan: నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టి
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్