TVS Apache: డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌తో కొత్త అపాచీ RTR 160

TVS Apache RTR 160: టీవీఎస్‌ తన కొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 160ని లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.1.35 లక్షలుగా నిర్ణయించింది.

Published : 09 Dec 2023 21:56 IST

TVS Apache RTR 160 | చెన్నై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ (TVS).. 2024 అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4Vని లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.1.35 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, వెనుకవైపు పెద్ద డిస్క్‌ బ్రేక్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, వాయిస్‌ అసిస్టెంట్‌ వంటి సదుపాయాలతో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. గోవాలో జరిగిన మోటోసోల్‌ ఈవెంట్‌లో ఈ బైక్‌ను లాంచ్‌ చేశారు.

కొత్త అపాచీలో 160సీసీ సింగిల్ సిలిండర్‌, ఎయిర్‌/ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 17.35 హెచ్‌పీ పవర్‌ను, 14.73 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. వెనుక వైపు 240 ఎంఎం లార్జ్‌ డిస్క్‌ బ్రేక్‌ ఇస్తున్నారు. ఇందులో అర్బన్‌, రెయిన్‌, స్పోర్ట్‌ పేరిట మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. ముందువైపు కన్వెన్షనల్‌ టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, వెనుక వైపు మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఇస్తున్నారు.

విక్రయాల ఎఫెక్ట్‌.. జిమ్నీపై మారుతీ భారీ డిస్కౌంట్‌

టీవీఎస్‌ తన స్మార్ట్‌కనెక్ట్‌ ఫీచర్లను కొత్త అపాచీకి జోడించింది. వాయిస్‌ అసిస్టెంట్‌, టర్న్‌-బై- టర్న్‌ నావిగేషన్‌, కాల్‌/ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌, క్రాష్‌ అలర్ట్‌ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి. స్పోర్ట్‌ మోడ్‌లో బైక్‌ టాప్‌స్పీడ్‌ గంటకు 114 కిలోమీటర్లు. మిగిలిన రెండు మోడ్‌లలో గంటకు 103 కిలోమీటర్లు చొప్పున ప్రయాణించొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ 4V, బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160 బైకులకు ఈ బైక్‌ గట్టి పోటీ ఇవ్వనుంది. బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు