Twitter: ఈరోజు నుంచి ఆ ఫీచర్‌ ట్విటర్‌ బ్లూ యూజర్లకు మాత్రమే!

Twitter: 2ఎఫ్‌ఏ ఫీచర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది. అందుకే దీన్ని బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ప్రత్యేక ఫీచర్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Updated : 20 Mar 2023 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ ఎస్‌ఎంఎస్‌ ‘టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA)’ ఈరోజు (2023 మార్చి 20) నుంచి అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండదు. కేవలం ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి మాత్రమే ఈ ఫీచర్‌ లభిస్తుంది. అయితే, ప్రత్యేకంగా 2ఎఫ్‌ఏ మాత్రమే కావాలనుకుంటే మాత్రం కుదరదు. ట్విటర్‌ లాగిన్‌లో అదనపు భద్రత కావాలంటే ట్విటర్‌ బ్లూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందే.

2ఎఫ్‌ఏ ఫీచర్‌ను ఉచితంగా అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ట్విటర్‌ (Twitter) ఫిబ్రవరిలోనే ప్రకటించింది. కొంతమంది ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపింది. అందుకే దీన్ని ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ప్రత్యేక ఫీచర్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2ఎఫ్‌ఏ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకున్న నాన్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లు దాన్ని డిజేబుల్‌ చేసుకోవాలని కోరింది. దానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అది నేటితో ముగియనుంది.
(ఇదీ చదవండి: గ్రూప్‌కి టైమింగ్‌ .. కాల్‌ మ్యూట్‌.. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లివే!

ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే నెలకు రూ.900, ఏడాదికి 9,400 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌ ఇంటర్‌ఫేస్‌ కోసం మాత్రమే అయితే నెలకు రూ.650, సంవత్సరానికి రూ.6,800 చెల్లించాలి. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే 2ఎఫ్‌ఏతో పాటు వెరిఫైడ్‌ చెక్‌మార్క్‌, సుదీర్ఘ పోస్ట్‌లు, ట్వీట్ల ఎడిట్‌, యాప్‌ ఐకాన్‌ మార్చడం.. వంటి అదనపు ఫీచర్లను పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని