స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లలో గుజరాత్‌ను దాటేసిన యూపీ.. అగ్రస్థానం ఈ రాష్ట్రానిదే!

stock market investors: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఎక్కువ మంది మదుపర్లతో గుజరాత్‌ స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ అధిగమించింది.

Updated : 29 Dec 2023 17:58 IST

stock market investors | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో తొలిసారి 8 కోట్ల మైలురాయిని అందుకుంది. గతేడాది డిసెంబరు 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, గుజరాత్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో రెండో స్థానంలో నిలిచింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే  సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా.. 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.

2023లో పోస్టాఫీసు పథకాల్లో వచ్చిన మార్పులివే..

పెట్టుబడిదారుల విషయంలో యూపీ 33.8 శాతం వృద్ధి నమోదు చేయగా.. గుజరాత్‌ 17.2శాతం వృద్ధిని కనబరిచింది. 47 లక్షల కంటే ఎక్కువ మంది స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌ ఉన్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు దూసుకెళ్తుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాదిలో మన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కనబరిచిన వృద్ధే అందుకు ఉదాహరణ. నిఫ్టీ దాదాపు 20శాతం పెరగ్గా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 18శాతానికి పైగా లాభపడింది. తాజాగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ విలువ తొలిసారి నాలుగు ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు