వాట్సప్‌లో ఇ-మెయిల్‌ వెరిఫికేషన్‌.. ఏఐ చాట్‌బాట్‌!

వాట్సప్‌లో కొత్తగా ఇ-మెయిల్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఏఐ చాట్‌బాట్‌ను వాట్సాప్‌ కొందరు యూజర్లకు తీసుకొచ్చింది.

Published : 21 Nov 2023 14:03 IST

Whatsapp new features | ఇంటర్నెట్‌ డెస్క్‌: మెటాకు చెందిన పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌.. వాట్సప్‌ (Whatsapp) తన యాప్‌లో కొత్తగా మరో రెండు ఫీచర్లను తీసుకొచ్చింది. అందులో ఒకటి ఇ-మెయిల్‌ ఒకటి కాగా.. మరొకటి ఏఐ అసిస్టెంట్‌. ఈ రెండు ఫీచర్లు ఎవరెవరికి అందుబాటులోకి వచ్చాయి? ఎలా పనిచేస్తాయి? ఎలా ఉపయోగపడతాయనేది ఇప్పుడు చూద్దాం..

ఇ-మెయిల్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ప్రస్తుతం ఐఓఎస్‌ యూజర్లకు వాట్సప్‌ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ఇ-మెయిల్‌ ఐడీని తమ అకౌంట్‌కు జోడించొచ్చు. ఎప్పుడైనా యాప్‌ లాగిన్‌ సమయంలో ఎస్సెమ్మెస్‌ రాక ఇబ్బంది పడకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. సెల్యులర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పుడు ఈ ఫీచర్‌ పనికొస్తుంది. ప్రస్తుతానికి ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకురాగా.. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. ఇప్పటికీ వాట్సప్‌ అకౌంట్‌కు ఎస్సెమ్మెస్‌ మాత్రమే ప్రాథమిక వెరిఫికేషన్‌గా కొనసాగనుంది. ఇందుకోసం వాట్సప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌ మెనూలోకి వెళ్లి ఇ-మెయిల్‌ అడ్రస్‌ను యాడ్ చేసుకోవాలి. వెరిఫికేషన్‌ అవసరం అయినప్పుడు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

తక్కువ ధరకే క్లౌడ్‌ సర్వీస్‌తో జియో కొత్త ల్యాప్‌టాప్‌!

వాట్సప్‌లో ఏఐ ఫీచర్లను తీసుకురానున్నట్లు మెటా ఇది వరకే ప్రకటించింది. అందుకు అనుగుణంగా వాట్సప్‌లో ఏఐ చాట్‌బాట్‌ ఫీచర్‌ను అమెరికాలోని కొందరు యూజర్లకు మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ రంగులతో కూడిన చాట్‌బాట్‌ బటన్‌ చాట్స్‌ సెక్షన్‌పైన దర్శనమిస్తోంది. ఈ చాట్‌బాట్‌ ఫీచర్‌తో ఏమేం చేయొచ్చన్న దానిపై పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. రియల్‌టైమ్‌ వెబ్‌ రిజల్ట్స్‌ను ఇది అందించనున్నట్లు తెలుస్తోంది. టెక్ట్స్‌ నుంచి ఇమేజ్‌ జనరేట్‌ చేయడానికీ ఉపయోగపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని