WhatsApp: ఇక డేట్‌తో మెసేజ్‌లు వెతకొచ్చు.. వాట్సప్‌ కొత్త ఫీచర్‌!

WhatsApp: సంభాషణల్లోని టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ నోట్లను సులభంగా వెతికేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published : 07 Nov 2023 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) యూజర్ల కోసం మరో ఫీచర్‌ని పరిచయం చేసింది. ‘సెర్చ్‌ మెసేజ్‌ బై డేట్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. వాట్సప్‌లోని మెసేజ్‌లు, వాయిస్‌ నోట్లను డేట్‌ ఆధారంగా సులభంగా వెతకటం కోసం ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందించే వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

సాధారణంగా వాట్సప్‌లో ఎవరి మెసేజ్‌లు అయినా వెతకాలంటే సెర్చ్ ఆప్షన్‌ను వినియోగిస్తాం. సరిగ్గా ఫలానా మెసేజ్‌ అని గుర్తుంటే సులువే. అదే ఇరువురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో గుర్తులేనప్పుడు పాత సందేశాలను వెతుక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తరచూ చాట్ చేసేవాళ్లో, గ్రూప్‌లైతే స్క్రోల్‌ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఫలానా రోజున మెసేజ్ పంపించారని గుర్తుంటే వెంటనే ఆ రోజు సందేశాలను సులువుగా వెతకొచ్చు. సాధారణంగా సెర్చ్‌లో వాయిస్‌ మెసేజ్‌లను వెతకడం కష్టం. అదే తేదీ ఆధారంగా అయితే ‘సెర్చ్‌ మెసేజ్‌ బై డేట్‌’ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే: విప్రో

ఈ ఫీచర్‌ వాడాలంటే సంభాషణలు వెతకటానికి సెర్చ్‌ బార్‌కి వెళ్లగానే క్యాలెండర్‌ కనిపిస్తుంది. అందులో మీకు కావల్సిన సంవత్సరం, నెల, తేదీని ఎంచుకోవాలి. అంతే ఆ రోజుకు సంబంధించిన టెక్ట్స్‌, వాయిస్‌ మెసేజ్‌లు మీకు కనిపిస్తాయి. దీనివల్ల సమయం కూడా వృథా కాదు. ప్రస్తుతం వాట్సప్‌ వెబ్‌ బీటా వెర్షన్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని