WhatsApp: ఇకపై వాట్సప్‌ వెబ్‌లోనూ చాట్‌ లాక్‌!

WhatsApp: యాప్‌కు మాత్రమే పరిమితమైన చాట్‌ లాక్‌ ఫీచర్‌ని వెబ్‌ వెర్షన్‌లోనూ తీసుకొచ్చేందుకు వాట్సప్‌ సిద్ధమవుతోంది.

Updated : 01 Feb 2024 22:19 IST

WhatsApp | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్ల ప్రైవసీని మరింతగా పెంచేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇందులో భాగంగా గతేడాదిలో యాప్‌ యూజర్ల కోసం ‘చాట్‌ లాక్‌’ ఫీచర్‌ని పరిచయం చేసింది. తాజాగా ఆ ఫీచర్‌ను వెబ్ వెర్షన్‌లోనూ అందించాలని చూస్తోంది. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.

మూలధన వ్యయం ₹11.11 లక్షల కోట్లు

వాట్సప్‌ వెబ్‌ వెర్షన్‌లో ‘చాట్‌ లాక్‌’ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుందని వాబీటా పేర్కొంది. ఫీచర్‌కి సంబంధించిన ఫొటోను సైతం పంచుకుంది. దాన్ని పరిశీలిస్తే.. వాట్సప్‌ వెబ్‌లో కొత్తగా డిజైన్‌ చేసిన సైడ్‌బార్‌ ఎడమవైపు కనిపిస్తుంది. అందులోనే ‘చాట్‌ లాక్‌’ ఐకాన్‌, ఆర్కైవ్‌ చాట్స్‌ (Archived Chats), స్టార్డ్‌ మెసేజెస్‌ ఐకాన్‌ ఉన్నాయి. సాధారణంగా మొబైల్ వాట్సప్‌లో ఈ ఫీచర్‌ సాయంతో ఒకసారి చాట్‌కు లాక్‌ చేస్తే.. కేవలం యూజర్‌ మాత్రమే ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌కోడ్‌ ద్వారా దాన్ని చూడగలుగుతారు. లాక్‌ చేసిన చాట్‌ను ఇతరులెవరూ తెరవడం కుదరదు. వెబ్ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలోనే వెబ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని