YouTube: భారత్‌లో 19 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్‌.. కారణం ఇదే..!

YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ పెద్ద ఎత్తున వీడియోలను తొలగించింది.

Published : 30 Aug 2023 22:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌(Youtube) భారీ సంఖ్యలో వీడియోలను తొలగించింది. యూట్యూబ్‌ కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించడంతో మన దేశంలో 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 19 లక్షల వీడియోలను తొలగించినట్టు వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల వీడియోలను తొలగించినట్టు పేర్కొంది.

కొత్త మోసం! చలాన్‌ పేరిట మెసేజులు.. క్లిక్‌ చేస్తే అంతే!

యూట్యూబ్‌ విధానాలను ఎలా అమలు చేస్తుంది? తదితర అంశాలతో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికలో గ్లోబల్‌ డేటాను విడుదల చేసింది. యూట్యూబ్‌ తొలగించిన వీడియోల వివరాలను అందులో పేర్కొంది. యూట్యూబ్‌ కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్‌లో 1.9 మిలియన్ల వీడియోలను తీసేసింది. అలాగే అమెరికాలో 6,54,968 వీడియోలు,  రష్యాలో 4,91,933, బ్రెజిల్‌లో 4,49,759 చొప్పున భారీగా వీడియోలు తొలగించించినట్టు తెలిపింది. ఓ కంపెనీగా మొదటి నుంచే తమ కమ్యూనిటీ మార్గదర్శకాలు హానికర కంటెంట్‌ నుంచి యూట్యూబ్‌ కమ్యూనిటీకి రక్షణగా నిలుస్తున్నాయని.. తాము మెషిన్ లెర్నింగ్, రివ్యూ చేసే కొందరు వ్యక్తులతో కలిపి తమ విధానాలను అమలు చేస్తున్నట్టు యూట్యూబ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని