Published : 04/04/2021 02:49 IST

వెన్నెముక దృఢంగా ఉండాలంటే...

ఎక్కువ సేపు నిలబడినా, కూర్చున్నా... వీపు, వెన్నెముక నొప్పులు బాధిస్తుంటాయి. అలాగే సయాటికాతో ఇబ్బందిపడుతున్నా ఈ వ్యాయామాలతో ఉపశమనం పొందొచ్చు.


సుప్త అర్ధ మత్స్య్రేంద్రాసనం

కాళ్లను చాపి పడుకోవాలి. ఫొటోలో చూపిన విధంగా కుడిచేత్తో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. ఎడమచేయి కుడి మోకాలి మీద ఉండాలి. ఈ స్థితిలో అర నిమిషంపాటు ఉండటానికి ప్రయత్నించాలి. తర్వాత కాళ్లను ముందుకు చాపి విశ్రాంతి తీసుకోవాలి. మరోవైపూ ఇలాగే చేయాలి. దీనివల్ల కింది భాగాన్ని ఒకవైపు, పైభాగాన్ని మరోవైపు తిప్పడానికి వీలవుతుంది.


ఏకపాద సేతుబంధాసనం

నేల మీద పడుకుని మెకాళ్లను మడిచి కాలి మడమలు పిరుదులకు తాకేలా పెట్టాలి. చేతులను శరీరానికి పక్కన ఉంచాలి. ఆ తర్వాత అరచేతుల మీద బరువు వేస్తూ నడుమును పైకి లేపాలి. ఫొటోలో చూపిన విధంగా అరచేతులను నడుము కింద పెట్టి, మోచేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి. తర్వాత కుడికాలిని మెల్లిగా పైకి లేపాలి. ఉండగలిగినంత సేపు ఈ స్థితిలో ఉండాలి. ఆ తర్వాత ఎడమకాలితోనూ ఇలా చేయాలి. కాలు పైకి పెట్టడం రాకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. ముందుగా నడుమును పైకి లేపడం వస్తే ఆ తర్వాత మెల్లిగా కాలునూ లేపొచ్చు.  


మేరుదండాసనం

నేల మీద పడుకుని ఎడమకాలి మడమను పిరుదులకు సమానంగా, ఎడంగా పెట్టాలి. అరచేతులను నేలకు ఆనించాలి. రెండు మోకాళ్లు ఎడమవైపు పెట్టి కుడిచేతివైపు చూడాలి. మోకాళ్లను నేలకు ఆనించాలి. వీలుకాకపోతే మోకాలి కింద దిండు పెట్టుకోవచ్చు. పది నుంచి ఇరవైసెకన్లపాటు ఈ స్థితిలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. శ్వాస వదులుతూ ఇప్పుడు మెకాళ్లను కుడివైపు పెట్టి ఎడమవైపు చూడాలి.


మేరుదండాసనం

డుకుని కాళ్లను 90 డిగ్రీలు పైకి లేపాలి. చేతులను భుజాలకు సమానంగా నేల మీద ఆనించాలి. కాళ్లను మెల్లిగా కుడివైపు పెట్టి ఎడమవైపు చూడాలి. శరీరం మొత్తం ఆంగ్ల అక్షరం ‘ఎల్‌’ ఆకారంలో ఉండాలి. కాళ్లను ఇలాగే ఎడమపక్క పెట్టి కుడివైపు చూడాలి.


ఈ ఆసనాలన్నీ వేసిన తర్వాత శవాసనం వేసి తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. వీటి వల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు.


Advertisement

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి