
కొత్త సినిమాలు
హైదరాబాద్: శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘రణరంగం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర బృందం శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో శర్వా ధూమపానం చేస్తూ కనిపించారు. ఆయన లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంది. గుబురు గడ్డం, జుట్టుతో దర్శనమిచ్చారు. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. శర్వానంద్ 27వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఆగస్టు 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క శర్వ తమిళ హిట్ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కథానాయిక. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
Tags :