close
హాలీవుడ్
నా అభిమాన నాయిక జాక్వెలైన్‌

- హలీవుడ్‌ పాప్‌ గాయని క్యాటీ పెర్రీ

ప్రముఖ హలీవుడ్‌ పాప్‌ సింగర్‌ క్యాటీ పెర్రీకి అభిమాన కథానాయిక ఎవరో తెలుసా? బాలీవుడ్‌ నాయిక జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. ఇండియా టూర్‌లో భాగంగా మంగళవారం ముంబయిలో జరిగిన ఓ సంగీత వేడుకకు హాజరైంది క్యాటీ పెర్రీ. ఆ కార్యక్రమంలో క్యాటీ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇండియాలో జాక్వెలైన్‌ రూపంలో నాకో మంచి స్నేహితురాలు దొరికింది. ఇద్దరం కలిసి ముంబయిని సరదాగా చుట్టేస్తున్నాం’’ అని చెప్పింది. బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నాయిక ఎవరు? అని క్యాటీని అడిగితే...‘ఇంకెవరు..జాక్వెలైన్‌’ అని సమాధానం చెప్పింది. ఈ వేడుకలో పాల్గొన్న జాక్వెలైన్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఇష్టమైన గాయని క్యాటీ. నా జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఆమె పాటలే నాకు సాంత్వన. ఆమె ఓ అద్భుతం’’ అంటూ క్యాటీని ప్రశంసలతో ముంచెత్తింది. ఈనెల 16న ముంబయిలో సంగీత కచేరీలో పాల్గొనబోతోంది క్యాటీ.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.