Aadhaar update: ఆధార్‌ అప్‌డేట్‌ అంటూ మోసాలు.. ఉడాయ్‌ అలర్ట్‌!

UIDAI: ఆధార్‌ అప్‌డేట్ చేయటానికి వ్యక్తిగత సమాచారం అడుగుతూ మెయిల్‌, వాట్సాప్‌లకు మెసేజ్‌లు వస్తుడటంతో ఉడాయ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 18 Aug 2023 18:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆధార్‌ అప్‌డేట్‌ (Aadhaar update) చేయాలంటూ మీకు మెసేజ్‌లు అందుతున్నాయా? దాంతో పాటు మీ ఆధార్‌ వివరాలు తెలపాలంటూ వాట్సాప్‌, మెయిల్‌లో సందేశాలు వస్తున్నాయా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి వివరలేవీ ప్రభుత్వ రంగ సంస్థలు అడగవు. ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలనుకొనే వారిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత సమాచారం కాజేయాలని సైబర్‌ మోసగాళ్లు ఈ తరహా మోసాలను తెరతీస్తున్నారు. అసలే ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ గడువు ముగుస్తుండటంతో చాలా మంది నిజమనుకొనే ప్రమాదం ఉంది. దీంతో ఉడాయ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

‘ఏ వ్యక్తి వ్యక్తిగత గుర్తింపు/చిరునామా వివరాలను UIDAI ఎప్పటికీ అడగదు. ఆధార్‌ అప్‌డేట్‌ చేయటానికి వ్యక్తిగత సమాచారం కోసం వాట్సాప్‌ (WhatsApp), ఈ-మెయిల్‌ (email) ద్వారా మెసేజ్‌లు పంపదు. మీ దగ్గర్లోని ఆధార్‌ కేంద్రాల్లో లేదా మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోండి’ అంటూ  ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతా ద్వారా హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే మార్గాల ద్వారా అప్‌డేట్‌ చేసుకోకండి అంటూ సూచించింది.

దివాలా తీసిన రుణగ్రహీతలపై అడ్డగోలు ఛార్జీలు వద్దు.. ఆర్‌బీఐ మార్గదర్శకాలు

పదేళ్ల కోసారి ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలంటూ UIDAI ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువు 2023 జులై 14 తో ముగిసింది. దీంతో ఆ గడువును 2023 సెప్టెంబరు 14 వరకు పొడిగించింది.

ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ ఇలా..

  •  ఆధార్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.
  •  proceed to update address ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  •  ఓటీపీని ఎంటర్ చేసి Document Update ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై మీ ఆధార్‌ వివరాలు కనిపిస్తాయి. అందులో సవరణలు ఉంటే చేయాలి. లేదా నెక్ట్స్‌ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి.
  •  తర్వాత స్క్రీన్‌పై డ్రాప్‌ డౌన్‌ను ఎంచుకొని అందులో Proof of Identity, Proof of Address ఆప్షన్ ఎంచుకోవాలి.
  •  అందులో డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి Submit పై క్లిక్‌ చేయాలి. 
  •  14 అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ వస్తుంది (URN) ఇలా.. మీ ఆధార్‌ అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ అవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని