Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
Festival Sale: పండగ సేల్‌లో భాగంగా పలు ప్రీమియం ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కొన్నింటిపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి.
Festival Sale | ఇంటర్నెట్ డెస్క్: ప్రీమియం ఫోన్లు వాడాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల కొనడానికి వెనకాడుతుంటారు. అందుకే ఆఫర్లు ఉన్నప్పుడే వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి! పండగ సీజన్ నేపథ్యంలో ప్రారంభమవబోతున్న ప్రత్యేక సేల్ (Festive Sales) అందుకు మంచి అవకాశం. ఇప్పటికే ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ప్రత్యేక సేల్ వివరాలు ప్రకటించాయి. గూగుల్ పిక్సెల్, నథింగ్, యాపిల్ ఫోన్లను మంచి ఆఫర్లపై అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం..
రూ.36,500కే పిక్సెల్ ఫోన్..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale) అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక సేల్‌లో యాపిల్, గూగుల్ పిక్సెల్, నథింగ్ ఫోన్లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ఫోన్ రిటైల్ ధర రూ.43,999. కానీ, తాజా పండగ సేల్‌లో ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,499కే అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ధరకు లభించనుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఈ ఏడాది మే నెలలో విడుదలైన విషయం తెలిసిందే. పిక్సెల్ 7 ఫోన్ (Google Pixel 7)పైనా ఫ్లిప్‌కార్ట్ రాయితీ అందిస్తోంది. రూ.59,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్ రూ.36,499 వద్ద లభిస్తోంది. పిక్సెల్ 7 ప్రో (Google Pixel 7 pro)పై కూడా ఆఫర్లు ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇవి కూడా సేల్ (Flipkart Big Billion Days sale)లో అందుబాటులో ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో పేర్కొంది.
మెగా సేల్స్‌కు రెడీనా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ఐఫోన్లపై డీల్స్..
తాజా పండగ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.. ఐఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వివిధ ఆఫర్లను ఉపయోగించుకొని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 పండగ సేల్‌లో భాగంగా రూ.38,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రూ.79,900 ధరతో 2020లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఐఫోన్ 13, 14, 15 విడుదలైన తర్వాత ఈ ఫోన్ ధరలను యాపిల్ తగ్గించింది. తాజా సేల్‌లో రూ.3,000 కార్డు ఆఫర్, రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత రూ.32,999కే దక్కించుకోవచ్చు.
మరోవైపు ఐఫోన్ 13పై అమెజాన్ తగ్గింపు ధర (iPhone 13 Price) వద్ద అందిస్తోంది. 2021లో విడుదలైన ఈ ఫోన్లో బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోంది. తాజా సేల్‌లో ఇది రూ.39,999కే అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ఎస్బీఐ బ్యాంక్ కార్డు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల తర్వాత ఈ ధరకు ఫోన్ లభించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ఫోన్లు సైతం తగ్గింపు ధరకే అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. కానీ, ఆ ధర ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఈ ఫోన్లు వరుసగా రూ.50 వేలలోపు, రూ.60 వేలలోపు ధరకే లభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కానీ, ఆ ధరలు ఎంతనేది బహిర్గతం చేయలేదు. 2022 సెప్టెంబర్‌లో ఐఫోన్ 14, 14 ప్లస్ వరుసగా రూ.79,900, రూ.89,900 ధరతో విడుదలైన విషయం తెలిసిందే.
సేల్‌లో అందుబాటులో ఉన్న మరికొన్ని ప్రీమియం ఫోన్లు..
- శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung galaxy S23 Ultra) 5జీ ఫోన్ ధర రూ.1,24,999 కాగా.. తాజా సేల్ ఇది అమెజాన్‌లో రూ.1,16,999కి అందుబాటులో ఉంది. అలాగే గెలాక్సీ ఎస్23 (Samsung galaxy S23 5G) 5జీ ఎంఆర్పీ రూ.64,999. సేల్‌లో ఇది రూ.61,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, సేల్ ప్రత్యేక తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలిపిన తర్వాత ఈ ధరలు వర్తిస్తాయి. గెలాక్సీ ఎస్22 అల్ట్రాను అన్ని ఆఫర్ల తర్వాత రూ.74,999కు సొంతం చేసుకోవచ్చు.
- రూ.57,999 ధర వద్ద విడుదలైన రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT2 Pro) ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.26,999కే లభిస్తోంది. అయితే, ఈ ఫోన్లు సేల్‌లో పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు రియల్మీ తెలిపింది.
- నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) 5జీ ధర రూ.37,999 కాగా.. తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది రూ.23,999కి లభించనుంది.
- మోటోరోలా రేజర్ 40 (Motorola razr 40) ఫోన్ జులైలో రూ.59,999 ప్రారంభ ధర వద్ద విడుదలైంది. తాజా సేల్ అమెజాన్‌లో ఇది రూ.49,999కు అందుబాటులో ఉంది.
- వన్‌ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్ తాజా సేల్‌లో రూ.34,999 లభిస్తోంది. దీని అసలు ధర రూ.45,999.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి... -
OnePlus: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?
OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది. -
Airtel vs Jio: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్వర్క్ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. -
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Samsung Galaxy A05: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్‌ని లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Mozilla Firefox: బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి.. ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం సూచన
మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ కంప్యూటర్లలో బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ సూచించింది. -
Oneplus 12: రిలీజ్‌కు ముందే వన్‌ప్లస్ 12 లుక్ లీక్ (pics)
Oneplus 12: వన్‌ప్లస్ 12 ఫోన్ చైనాలో డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. విడుదలకు ముందు దీనికి సంబంధించిన చిత్రాలు బయటకొచ్చాయి. -
Aitana Lopez: ఈ ఏఐ మోడల్ సంపాదన నెలకు ₹9 లక్షలు
ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. స్పెయిన్‌కు చెందిన ఓ మోడల్ ఏజెన్సీ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది. -
Airtel: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్..
Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. -
google pay: గూగుల్ పేలో ఇకపై మొబైల్ రీఛార్జులపై ఫీజు!
Google pay Recharge: గూగుల్‌పేలో ఇక మొబైల్ రీఛార్జులపై స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుంది. -
Instagram: ఇన్‌స్టా యూజర్లు ఇక రీల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Instagram: పబ్లిక్ వీడియోలను సులువుగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. దాన్ని ఎలా ఎనేబల్ చేసుకోవాలంటే? -
Elon Musk: ‘ఎక్స్’లో మరో మార్పు.. ఆదాయం తగ్గుతున్న తరుణంలో మస్క్ కీలక నిర్ణయం!
Elon Musk: సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ విషయంలో గత నెలలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ ఉపసంహరించుకున్నారు. ఎక్స్ వేదికపై షేర్ చేసే లింక్స్‌కు హెడ్లైన్ కనిపించేలా తిరిగి మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
Google Pay: ఈ యాప్స్ వాడొద్దు.. యూజర్లకు గూగుల్ పే అలర్ట్
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గూగుల్ పే యాప్ యూజర్లకు కీలక సూచన చేసింది. -
Oneweb: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. వన్‌వెబ్‌కు స్పేస్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు
వన్‌వెబ్‌కు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి స్పేస్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. స్పెక్ట్రమ్ కేటాయింపు జరగాల్సి ఉంది. -
OnePlus: వన్‌ప్లస్ ఏఐ మ్యూజిక్ స్టూడియో.. నిమిషాల్లో కొత్త పాట రెడీ
OnePlus AI Music Studio: మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిలేకుండా, లిరిక్స్ రాయడం రాకున్నా సులువుగా టూల్ సాయంతో పాటను జెనరేట్ చేయొచ్చని తెలుసా?వన్‌ప్లస్ స్టూడియో ఆ సౌకర్యం కల్పిస్తోంది. -
వాట్సప్‌లో ఇ-మెయిల్ వెరిఫికేషన్.. ఏఐ చాట్‌బాట్!
వాట్సప్‌లో కొత్తగా ఇ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఏఐ చాట్‌బాట్‌ను వాట్సాప్ కొందరు యూజర్లకు తీసుకొచ్చింది. -
Jio Cloud PC: తక్కువ ధరకే క్లౌడ్ సర్వీస్‌తో జియో కొత్త ల్యాప్‌టాప్!
జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేయనుంది. ఇది పూర్తిగా క్లౌడ్ సర్వీస్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ డివైజ్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. -
ఫైబర్ యూజర్ల కోసం BSNL నుంచి వాట్సాప్ చాట్‌బాట్
బీఎస్ఎన్ఎల్ సంస్థ వాట్సప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. 1800 4444 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని పంపంపించి ఫైబర్ సేవలు పొందొచ్చు. -
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఎడిటింగ్ టూల్స్.. ఇకపై పోస్టులు నచ్చిన వారు మాత్రమే చూసేలా!
Instagram: ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ని యూజర్లకు పరిచయం చేసింది. అదే విధంగా రీల్స్‌లో మరిన్ని వినూత్నమైన ఫీచర్లను తీసుకొచ్చింది. -
Password: అత్యధిక మంది వాడుతున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా?
Password: ‘‘123456’’ను నార్డ్‌పాస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ‘అత్యంత వరస్ట్ పాస్వర్డ్’గా అభివర్ణించింది. దీన్ని హ్యాకర్లు కేవలం ఒక్క సెకన్లో కనిపెట్టగలరని తెలిపింది. -
OnePlus Speakers: వన్‌ప్లస్ నుంచి త్వరలో స్పీకర్లు?
OnePlus Speaker: ‘గెట్ రెడీ టు మేక్ సమ్ మ్యూజిక్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టా పోస్ట్‌లో ఓ చిన్న వీడియోను వన్‌ప్లస్ పోస్ట్ చేసింది. దీంతో కంపెనీ త్వరలో స్పీకర్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


తాజా వార్తలు (Latest News)
-
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.21 వేల లాభం
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
-
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు