Amazon: MSME ఎగుమతుల కోసం ఇండియన్‌ పోస్ట్‌తో అమెజాన్ జట్టు

Amazon: అమెజాన్‌ గురువారం ఏర్పాటు చేసిన సంభవ్‌ సమ్మిట్‌ 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత Sah-AIని పరిచయం చేసింది.

Published : 31 Aug 2023 19:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (MSME) ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కోసం ఇండియన్‌ పోస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్‌ (Amazon) ఇండియా తెలిపింది. అలాగే, దశాబ్దపు భాగస్వామ్యానికి గుర్తుగా ఒక పోస్టల్ స్టాంప్‌ను పోస్టల్‌ శాఖ ఆవిష్కరించింది. అమెజాన్‌ గురువారం ఏర్పాటు చేసిన సంభవ్‌ సమ్మిట్‌ 2023లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహాయ మత్రి జితేంద్ర సింగ్‌ ఆ స్టాంప్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తమ సెల్లర్ల కోసం జనరేటివ్‌ ఏఐ ఆధారిత డిజిటల్‌ అసిస్టెంట్‌ను అమెజాన్‌ తీసుకొచ్చింది. భారత్‌ సహా ప్రపంచంలో ఉన్న అమ్మకందారుల కోసం  Sah-AI పేరిట దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్, లిస్టింగ్, అడ్వర్టైజింగ్ సపోర్ట్ లాంటి పనులను సులభతరం చేయడం కోసం ఈ డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉపయోగపడుతుందని ఇ-కామర్స్‌ సంస్థ తెలిపింది. అంతేగాకుండా వినియోగదారుల ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేయడం కోసం ఇండియన్‌ రైల్వేకు చెందిన రైల్వేస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DFC)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు డీఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి ఇ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ కావడం గమనార్హం. 

పాత క్రోమ్‌ వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి..!

10 మిలియన్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (MSME)లను డిజిటలైజ్‌ చేయటంతో పాటూ ఇ-కామర్స్‌ ఎగుమతులను 20 బిలియన్లకు పెంచటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెజాన్‌ ఈ సందర్భంగా తెలిపింది. అంతేగాకుండా 2025 నాటికి భారతదేశంలో 2 మిలియన్ల ఉద్యోగాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. డిజిటలైజేషన్ వల్ల లక్షలాది చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుందని అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్ అభినవ్‌ సింగ్‌ తెలిపారు. దీనివల్ల  మార్కెటింగ్, పంపిణీ ఖర్చులు తగ్గడంతో పాటు, ఆర్థికవృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుపడుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని