Bank of India: 7.50% వడ్డీతో బీఓఐ కొత్త ఎఫ్‌డీ.. వీరికి మాత్రమే..

Bank of India: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..  175 రోజుల కాలపరిమితితో కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Updated : 02 Jan 2024 19:14 IST

Bank of India| ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India) కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్(FD)ను ప్రవేశపెట్టింది. 175 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసే వారికి 7.50శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. జనవరి 1న ప్రకటించిన ఈ స్కీమ్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

బీఓఐ తీసుకొచ్చిన  సూపర్‌ స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.50కోట్ల లోపు మాత్రమే డిపాజిట్‌ చేయొచ్చని బ్యాంక్‌ పేర్కొంది. స్వల్పకాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే సంపన్న భారతీయులు(HNI), వ్యాపారస్థులకు ఈ ఎఫ్‌డీ ఉపయోగపడుతుందని తెలిపింది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు కాలపరిమితితో చేసే రూ.2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై సీనియర్‌ సిటిజన్లకు 0.50శాతం అదనపు వడ్డీని ఇస్తోంది. 80ఏళ్లు పైబడిన సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.65శాతం మేర‌ వ‌డ్డీని అందిస్తోంది.

71 లక్షల భారతీయ ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం

ఇదిలా ఉండగా.. ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 50 బేసిస్‌ పాయింట్లు మేర పెంచింది. వీటితో పాటూ ఫెడరల్‌ బ్యాంక్‌ (Federal Bank), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (Kotak Mahindra Bank), డీసీబీ బ్యాంక్‌ (DCB Bank), యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank) కూడా టర్మ్ డిపాజిట్‌ వడ్డీ రేట్లను  2023 డిసెంబరులో పెంచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని