Insurance: ఓన్ డ్యామేజ్ కారు ఇన్సూరెన్స్‌తో ప్రయోజనాలివే..
కారుకు థర్డ్ పార్టీ కవర్ తప్పనిసరే, కానీ సంపూర్ణ కవరేజీ కోసం ఓన్ డ్యామేజ్ బీమాను ఎంచుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం భారతదేశంలోని అన్ని కార్లు థర్డ్ పార్టీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చెల్లుబాటు అయ్యే కవరేజీని కలిగి ఉండాలి. ఈ బీమా కవరేజీ ఉన్న కారు 3వ వ్యక్తిని గాయపరిచిన, వ్యక్తి మరణించిన, ఆస్తికి నష్టం కలిగించిన సందర్భాల్లో కారు యజమాని చెల్లించాల్సిన ఆర్థిక నష్టాన్ని థర్డ్ పార్టీ ఇన్సరెన్స్ బాధ్యత వహిస్తుంది. అయితే, కారు సొంత నష్టాన్ని చవి చూస్తే దానికి థర్డ్-పార్టీ బీమా ద్వారా ఎలాంటి కవరేజీ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓన్ డ్యామేజ్ బీమా ఆ కారు యజమానిని ఆర్థికంగా కాపాడుతుంది. సహజమైన లేదా వివిధ కారణాల వల్ల కారు చోరీకి గురయినా కూడా కారుకు బీమా కవరేజీ ఉంటుంది.
ఓన్ డ్యామేజ్ కారు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
ఆల్ రౌండ్ కవరేజీ:
ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు లేదా అనుకోని మానవ తప్పిదాల వల్ల కారు నష్టపోయినా ఈ బీమా దాన్ని ఆర్థికంగా భర్తీ చేస్తుంది. ఈ పాలసీ అన్ని చిన్న, పెద్ద నష్టాలతో సహా కారు మరమ్మతు ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. విపరీతమైన మరమ్మతు ఖర్చులయ్యే లగ్జరీ కార్ల యజమానులకు ఇది గొప్ప కవర్.
యాక్సిడెంట్, చోరీ:
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ వాహనానికి జరిగే నష్టాలకు కవరేజీని అందిస్తుంది. ఉదా: వరదలు, తుపాన్లు, కొండచరియలు, రాళ్లు విరిగిపడడం, భూకంపం, పిడుగులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా రోడ్డు, రైలు, వాయుమార్గం ద్వారా రవాణా చేస్తున్నప్పుడు లేదా అల్లర్లు, సమ్మె, హానికరమైన తీవ్రవాదం వంటి విపత్తుల వల్ల నష్టం జరిగినా మీ వాహనానికి జరిగే నష్టాలకు ఓన్ డ్యామేజీ కారు ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తుంది. ఇంకా అనేక కారణాల వల్ల కారు చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో కారును రికవరీ చేయకపోతే కారు యజమాని పెద్ద మొత్తాన్నే కోల్పోతాడు. ఈ పాలసీ క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ మొత్తంతో మీ చోరీకి గురయినా కారును కొత్త దానితో భర్తీ చేసుకోవచ్చు.
వార్షిక పునరుద్ధరణ, పాలసీ లభ్యత
ఈ పాలసీ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటవుతుంది. ఆ తర్వాత పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ కవరేజీలో ఉండే సమగ్ర పరిధి మీకు ఎల్లప్పుడూ భరోసానిస్తుంది. ఓన్ డ్యామేజ్ పాలసీని ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ సౌకర్యం ఉండడం వల్ల మార్కెట్‌లో వివిధ ప్లాన్‌లు, పాలసీలతో పోల్చి చూసుకోవచ్చు. తక్కువ ధరకు గరిష్ఠ కవరేజీని అందించే పాలసీని వేగంగా ఎంచుకోవచ్చు.
యాడ్-ఆన్‌లు
ఈ పాలసీ, యాడ్-ఆన్‌లు అని పిలిచే అనేక రకాల ఐచ్ఛిక కవరేజీ ప్రయోజనాలతో వస్తుంది. ఈ యాడ్-ఆన్ రైడర్స్‌తో పాలసీకి సంబంధించి కవరేజీ పరిధిని తక్కువ ఖర్చుతో విస్తరించుకోవచ్చు. కవరేజీ, క్లెయిమ్ మొత్తాన్ని పెంచుకోవడానికి తగిన యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు. ఊహించని అనేక నష్టాలను ఈ రైడర్స్ కవర్ చేస్తాయి. ఉదా: జీరో డిప్రిసియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, నో-క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్, మొదలైనవి.
వేటికి కవరేజీ ఉండదు?
మీ పాలసీలో నిర్వచించిన భౌగోళిక పరిమితుల వెలుపల జరిగే ప్రమాదాలకు కవరేజీ ఉండదు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైతే క్లెయిమ్ ఆమోదించరు. వాణిజ్య ప్రయోజనాల కోసం వ్యక్తిగత వాహనాన్ని ఉపయోగిస్తుంటే (ఉదా: రేసింగ్, స్పీడ్ టెస్టింగ్, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే) కవరేజీ ఉండదు.
అధిక ప్రీమియం
వాహనానికి సంబంధించి ‘ఆర్‌టీఓ’ (రిజిస్ట్రేషన్ స్థలం) కూడా బీమా ప్రీమియంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆర్‌టీఓల పరిధిలో మోటారు క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటాయి. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో వాహన వినియోగం మొదలైన వాటిపై ఆధారపడి అధిక రిస్క్‌ను కలిగి ఉంటాయి. వీటి కారణంగా ఇతర అనుకూలమైన ప్రాంతాల కంటే కూడా అధిక ప్రీమియం ఉంటుంది.
చివరిగా: ఇప్పటికీ చాలామందికి ఓన్ డ్యామేజ్ బీమా ప్రాముఖ్యత గురించి తెలియదు. ఇది తప్పనిసరి కాదని దాటివేస్తారు. వారు అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఓన్ డ్యామేజ్ బీమాపై కొంచెం అదనంగా ఖర్చు చేయడం వల్ల, భవిష్యుత్తులో వచ్చే విపత్తుల ఆర్థిక భారం నుంచి రక్షించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kamal Haasan: ఆయన్ని చూస్తే చాలా అసూయగా ఉంది: కమల్ హాసన్
-
Sports News
Virat Kohli: చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
-
Movies News
Tollywood:యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన