స్టార్టప్‌ల వెనుక మన స్టార్లు.. బాలీవుడ్ స్టార్ల పెట్టుబడులు వీటిలోనే..
Bollywood stars behind startups: బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్లు అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సినీ తారలు ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సూత్రం. అందుకే ఫేమ్ కొనసాగినంత కాలం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీబిజీగా కాలాన్ని గడిపేస్తుంటారు. వెండితెరపై విభిన్న పాత్రలతో సందడి చేస్తుంటారు. ఇప్పటి తారలు మరో ముందడుగు వేసి తమలోని వ్యాపారవేత్తను సైతం బయటకు తీస్తున్నారు. తాము సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని స్టార్టప్ (startups) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. తమ పెట్టుబడుల ద్వారా లాభాలు ఆర్జించడమే కాకుండా తమ పెట్టుబడుల ద్వారా ఆ స్టార్టప్‌లకూ గుర్తింపు తీసుకొస్తున్నారు. వాటి విజయంలో కీలక భూమిక పోషిస్తున్నారు. కథానాయకులు, నాయికలు అన్న భేదం లేకుండా ముందుకెళ్తున్నారు. అలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కొందరు బాలీవుడ్‌కు సినీ తారలు (Bollywood stars) గురించి ఇప్పుడు చూద్దాం..
- అలియా: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన అలియా భట్ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ముందందనే చెప్పాలి. పలు కంపెనీల్లో ఆలియా పెట్టుబడులు ఉన్నాయి. ఆలయాల్లో పూల వ్యర్థాలతో అగరబత్తీలు, దూప్‌స్టిక్‌లను తయారు చేసే ఫూల్.కో (Phool.co)లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు స్టైల్ క్రాకర్ (StyleCraker) ఆన్‌లైన్ దుస్తుల ప్లాట్‌ఫాంతో పాటు నైకాలోనూ అలియాకు పెట్టుబడులు ఉన్నాయి. Ed-a-Mamma పేరిట చిన్నపిల్లల దుస్తుల ప్లాట్‌ఫామ్‌నూ అలియా నిర్వహిస్తోంది.
- అనుష్క శర్మ: విరాట్ కోహ్లీ భార్యగా, బాలీవుడ్ నటిగా అనుష్క శర్మ అందరికీ సుపరిచితమే. మిల్లెట్స్‌తో తయారుచేసే ఫుడ్ బ్రాండ్ స్లర్ప్ ఫామ్ (Slurrp Farm)లో అనుష్కకు పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు డిజిట్ ఇన్సురెన్స్ కంపెనీ, బ్లూ ట్రైబ్ అనే మీట్ కంపెనీలోనూ ఆమెకు వాటాలున్నాయి.
- ప్రియాంక చోప్రా: హాలీవుడ్ స్థాయిలో పేరు తెచ్చుకున్న మరో నటి ప్రియాంక చోప్రా. బంబుల్ (Bumble) అనే డేటింగ్, సోషల్ మీడియా యాప్‌లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అలాగే అపార్ట్‌మెంట్ లిస్ట్ అనే అమెరికా రెంటల్ మార్కెట్ వ్యాపారంలోనూ ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెట్టారు.
- దీపిక పదుకొణె: బాలీవుడ్ నటి, రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె సైతం పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు బాగా పాపులర్ అయిన మింత్రాను నెలకొల్పిన వారిలో దీపిక సైతం ఉన్నారు. ఆ తర్వాత దాన్ని వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక కేఏ ఎంటర్‌ప్రైజస్ ఎల్‌ఎల్‌పీ పేరిట ఓ కంపెనీ నెలకొల్పారు. దాని ద్వారా అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఎపిగమియా, ఎడ్‌టెక్ కంపెనీ ఫ్రంట్ రో, ఎలక్ట్రిక్ ట్యాక్సీల స్టార్టప్ బ్లూస్మార్ట్, పెంపుడు జంతువుల కోసం ఉద్దేశించిన సూపర్ టెయిల్స్, స్పేస్ టెక్నాలజీకి చెందిన బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ వంటి స్టార్టప్ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు ఉన్నాయి.
- సోనూసూద్: కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్.. కె12 అనే ఎడ్యుకేషన్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. జితిన్ భాటియాతో కలిసి Explurger అనే సోషల్ మీడియా యాప్‌ను సైతం సోనూ ప్రారంభించారు.
- సునీల్ శెట్టి: మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సైతం కేవలం వినోద రంగానికి పరిమితం అవ్వలేదు. అనేక స్టార్టప్ కంపెనీల్లో ఆయనకూ పెట్టుబడులు ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌టీ వ్యాపారంలోనూ ఉన్నారు. Colexion అనే కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. హెల్త్ టెక్ స్టార్టప్ వైరూట్స్‌లోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. బాడీఫస్ట్ అనే న్యూట్రిషన్ బ్రాండ్‌లోనూ, అక్వాటిన్ అనే ఫిట్‌నెస్ బ్రాండ్‌లోనూ ఆయనకు వాటాలు ఉన్నాయి.
- వీరే కాకుండా సుగర్ కాస్మోటిక్స్ కంపెనీలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు, మామా ఎర్త్ కంపెనీలో శిల్పాశెట్టి కుంద్రాకు పెట్టుబడులు ఉన్నాయి. కొన్ని బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్