Health Insurance: యువతకు ఆరోగ్య బీమా అవసరమేనా?
ఆరోగ్య బీమా ఖర్చును వృధాగా భావించకూడదు. ఇది కూడా ఆరోగ్యానికి పెట్టుబడి లాంటిదే.
ఇంటర్నెట్ డెస్క్: వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు సహజమే. యువతలో అనారోగ్యాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ, రాత్రి వేళ ఉద్యోగాలు, కుర్చీలో కూర్చుని చేసే పనులు, నిద్రని అశ్రద్ధ చేయడం, వివిధ ఆహార అలవాట్లు, జీవన శైలిలో మార్పుల కారణంగా యువత కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల చికిత్సనే చాలా మంది ఆశిస్తారు. అలాంటి సమయంలో ఆరోగ్య బీమా వారిని ఆర్థికంగా కాపాడుతుంది.
యువత కూడా విద్యా, ఉపాధి అవకాశాల కోసం ఎక్కువ చోట్లకు, దూర ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది. ప్రాంతం మారడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ పని గంటలు వారి మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు, క్యాన్సర్లు ఈ కాలంలో సాధారణమైపోయాయి. పనిలో ఏర్పడిన అనేక సవాళ్ల వల్ల యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారని ఒక సర్వే తెలిపింది. ఇలాంటి మానసిక రుగ్మతలకు దీర్ఘకాల చికిత్స అవసరమేర్పడుతుంది. నిపుణులైన డాక్టర్ల అవసరం కూడా చాలా ఉంటుంది. పెద్ద పట్టణాలకు చికిత్సకు వెళ్లాల్సి రావడంతో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీమా బాగా పనిచేస్తుంది.
చిన్న వయసులోనే ఆరోగ్య బీమాను ఎందుకు తీసుకోవాలి?
ఎక్కువ శాతం చిన్న వయసువారికి వైద్యపరమైన ఇబ్బందులు పెద్దగా ఉండవు. కాబట్టి ప్రీమియం తక్కువుంటుంది. ఆరోగ్య పరీక్షలు లేకుండానే బీమా లభిస్తుంది. చిన్న వయసులో పెద్ద వ్యాధులు, ఆరోగ్య సంబంధిత సమస్యలు తక్కువ ఉంటాయి. కాబట్టి పాలసీదారులు ఎక్కువ కాలం పాటు నో-క్లెయిమ్ బోనస్ పొందుతారు. ఆ వయసులో వారికి కుటుంబపరమైన బాధ్యతలు పెద్దగా ఉండవు కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియం ఖర్చు వారికి భారం కాదు. వయసు పెరిగే కొద్దీ, తక్కువ హెచ్చు ప్రీమియంతోనే బీమా పునరుద్ధరించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు ఆరోగ్య బీమా కవరేజీలో ఉంటారు.
వెయిటింగ్ పీరియడ్
కొన్ని రోగాలకు 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆ వెయిటింగ్ పీరియడ్ వ్యవధిని తేలిగ్గానే దాటేస్తారు. తక్కువ ప్రీమియం చెల్లింపుతోనే ఊహించని వైద్య ఖర్చుల వల్ల తలెత్తే ఆర్థిక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో మీకు బీమా కొండంత అండగా ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు
ఆరోగ్య బీమా పాలసీలో ప్రీమియం మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
అదనపు ప్రయోజనాలు
ఆరోగ్య సంబంధిత ఖర్చుల నుంచి పాలసీదారులను రక్షించడానికి.. బీమా కంపెనీలు హెల్త్ రైడర్స్ ప్రవేశపెట్టాయి. ఈ రైడర్స్ బీమా చేసిన వారి అవసరాలకు సరిపోయేలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. చిన్న వయసు నుంచే ఇలాంటి రైడర్లు ఉండడం వల్ల సమగ్ర బీమా కవరేజీ పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!